బాబూ ధర్మం చెయ్ బాబు
చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : రేలంగి
పల్లవి:
బాబూ... ఉ ఉ ఉ ఉ ఊ ఊ ఊ
బాబూ.. బాబూ
బాబూ ధర్మం చెయ్ బాబు..
కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది..
ఖర్మ నసిస్తది.. బాబూ
ధర్మం చెయ్ బాబు...
కాణీ ధర్మం చెయ్ బాబు
చరణం 1:
కోటి విద్యలు కూటి కోసమే
పూటే గడవని ముష్టి జీవితం
బాబు... కోటి విద్యలు కూటికోసమే
పూటే గడవని ముష్టి జీవితం
పాటుపడగయే పని రాదాయే
సాటి మనిషిని సావనా బాబూ
ధర్మం చెయ్ బాబు
కాణీ ధర్మం చెయ్ బాబు
చరణం 2:
ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు
కాసులతోనే కడుపు నిండదు
అయ్యా... అమ్మా... బాబూ...
చేసేదానం చిన్నదే అయినా
పాపాలన్ని బాపును బాబూ
ధర్మం చెయ్ బాబు
కాణీ ధర్మం చెయ్ బాబు
చరణం 3:
నీ చెయ్ పైన నా చెయ్ కిందా
ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ..
అయ్యా...
నీ చెయ్ పైన నా చెయ్ కిందా
ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ
మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం... అరణా ఒరణా రెండణా
ధర్మం చెయ్ బాబు
కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది
ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు
కాణీ ధర్మం చెయ్ బాబు
అయ్యా... అమ్మా... బాబూ..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి