RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, సెప్టెంబర్ 2025, గురువారం

తోడు నీడ ఎవరులేని ఒంటరి | Thodu Needa Evaruleni Ontari | Song Lyrics | Manchi Chedu (1963)

తోడు నీడ ఎవరులేని ఒంటరి



చిత్రం :  మంచి-చెడు (1963)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్, రామ్మూర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  పి. సుశీల


పల్లవి:


తోడు నీడ ఎవరులేని ఒంటరి..

వాడు లోకమనే పాఠశాల చదువరీ...

చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ...

వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ...

తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ..

చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... 

వాని చిత్తమున మెత్తదనం కలదు మరీ

చిత్తమున మెత్తదనం కలదు మరీ...


చరణం 1:


కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు.. 

కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు

కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు... 

కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు

ఉన్నదంత యిచ్చి ఊరడించునూ... 

తానె ఊరు చేరువరకు తోడువచ్చును

ఊరు చేరువరకు తోడు వచ్చును...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ

లోకమనే పాఠశాల చదువరీ...


చరణం 2:


ఆకలైన పులిలాగే ఉరుకును... 

కాని మచ్చికతో మనసు నిచ్చివేయును

కళా హృదయమున్న మేలి రసికుడు... 

సదా కనులలోనే కదలాడే యువకుడు

కనులలోనే కదలాడే యువకుడు...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ

లోకమనే పాఠశాల చదువరీ...


చరణం 3:


రేపు వాని మనసు మార వచ్చును... 

వాడు మాపు మాని పగలు తిరుగ వచ్చును

తల్లి మనసు చల్లదనము తెలియును... 

వాని ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...

ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ..

చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... 

వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ

చిత్తమున మెత్తదనం కలదుమరీ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు