RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

25, సెప్టెంబర్ 2025, గురువారం

పుడమి పుట్టెను నాకోసం | Pudami Puttenu Naakosam | Song Lyrics | Manchi Chedu (1963)

పుడమి పుట్టెను నాకోసం



చిత్రం :  మంచి-చెడు (1963)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

కడలిపొంగెను నాకోసం.. 

తల్లిఒడినే పరచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

కడలిపొంగెను నాకోసం.. 

తల్లిఒడినే పరచెను నాకోసం


చరణం 1:


నిన్న చీకటి తొలగెనులే.. 

నేడు వెలుగై వెలిగెనులే

నవ్యజీవన ప్రాభాతం.. 

నన్నే రమ్మని పిలిచెనులే

నవ్యజీవన ప్రాభాతం.. 

నన్నే రమ్మని పిలిచెనులే


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


చరణం 2:


ఉదయ భానుని కాంతులలో.. 

గగన మలిదిన రంగులలో

విశ్వశిల్పిని కన్నానూ.. 

వింట వానిని విన్నాను

విశ్వశిల్పిని కన్నానూ.. 

వింట వానిని విన్నాను


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


చరణం 3:


జగతి సకలం నాదైనా.. 

బ్రతుకు పువ్వుల బాటైనా

తల్లిమనసే గుడినాకూ.. 

తల్లి సేవే గురి నాకూ

తల్లిమనసే గుడినాకూ.. 

తల్లి సేవే గురి నాకూ


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

కడలి పొంగెను నాకోసం.. 

తల్లిఒడినే పరచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు