RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, సెప్టెంబర్ 2025, బుధవారం

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు | Mukkoti Devathalu Okkatainaru | Song Lyrics | Bava Maradallu (1960)

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు



చిత్రం :  బావమరదళ్ళు (1960)

సంగీతం :  పెండ్యాల నాగేశ్వరరావు 

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు


ఎక్కడున్నాగాని దిక్కువారేకదా

చిక్కులను విడదీసి దరిజేర్చలేరా

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు...


చరణం 1:


ఆలి ఎడబాటెపుడు 

అనుభవించెడువాడు

అలమేలుమంగపతి 

అవనిలో ఒకడే....

ఏడుకొండలవాడు 

ఎల్లవేల్లలయందు

దోగాడు బాలునికి 

తోడునీడౌతాడు


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు...


నెల్లూరి సీమలో 

చల్లంగ శయనించు

శ్రీరంగనాయకా ఆనందదాయకా

తండ్రి మనసుకు శాంతి 

తనయునికి శరణు

దయచేయుమా నీవు 

క్షణము ఎడబాయకా


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు....


చరణం 2:


ఎల్లలోకాలకు తల్లివై నీవుండ

పిల్లవానికి ఇంక తల్లి ప్రేమా కొరత

బరువాయె బ్రతుకు 

చెరువాయె కన్నీరు

కరుణించి కాపాడు మా కనకదుర్గా


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు...


గోపన్నవలె వగచు 

ఆపన్నులను గాచి

బాధలను తీర్చేటి భద్రాద్రివాసా

ఆ....

బాధలను తీర్చేటి భద్రాద్రివాసా

నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా

చిన్నారి బాలునకు శ్రీ రామ రక్ష


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు...


చరణం 3:


బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన

నారసింహుని కన్నా 

వేరు దైవము లేడు

అంతు తెలియగారాని 

ఆవేదనలు గలిగి

చింతలను తొలగించు 

సింహాచలేశ


ముక్కోటి దేవతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు....


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు