RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, సెప్టెంబర్ 2025, బుధవారం

కృష్ణా నా మొర వినవా | Krishna Naa Mora Vinava | Song Lyrics | Kalyana Mantapam (1971)

కృష్ణా.... నా మొర వినవా



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


కృష్ణా.... నా మొర వినవా 

నను దయగనవా..

కన్నె బ్రతుకు కాపాడరావా..

ఈ ఘోరబలి ఆపించలేవా... 

ఆపించలేవా..


నా మొర వినవా.. 

నను దయగనవా

దీనులబ్రోచే దైవము కావా..

ఏనాడైనా వరమడిగితినా

ఈ వరమైనా ఈయగలేవా....  

కృష్ణయ్యా కరుణించవయ్యా


చరణం 1 :


ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... 

లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా

ఇల్లాలు కాగోరె ఇన్నాళ్లుగా... 

లోకాన్ని ఎదిరించె ఇన్నేళ్ళుగా

ఓటమి కలిగే ఆశలు తొలగే..

ఈ ఘోరానికె తలవంచె

జగమింతేనా... బ్రతుకింతేనా..


నా మొర వినవా 

నను దయగనవా


చరణం 2 :


మగువను లోకం బానిస చేయగ... 

మౌనం పూనావా..

తాళికి తరుణిని దూరం చేయగ.. 

జాలే మరిచావా..

న్యాయం విడిచావా..

ఘోరం తలిచావా..

వినవేలా... శిలవేనా... 

రావేలా... కృష్ణా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు