RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, సెప్టెంబర్ 2025, బుధవారం

ఏడవకే చిన్నారి పాపా | Yedavake Chinnari Papa | Song Lyrics | Kalyana Mantapam (1971)

ఏడవకే చిన్నారి పాపా



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత : దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల


పల్లవి : 


ఏడవకే చిన్నారి పాపా... 

చిట్టి పాపా..ఆ

చూడలేనే కన్నీరు పాపా..

ఆ....  ఆ....  ఆ....

నీవు పెరగాలి మరవాలి శోకం..

రేపు పాడాలి ఆనంద గీతం

ఆ..ఆ..... ఆ....ఆ..ఆ..... ఆ...... 

ఆ..ఆ..ఆ


చరణం 1 :


కారు మేఘాల చీకట్ల క్షోభ... 

నేడేనమ్మా..

రేపు శతకోటి కిరణాలశోభ... 

నీదేనమ్మా..

ఆశలన్నీ....పూచునమ్మా..

ఆశలన్నీ... పూచునమ్మా ....

కాంతులీన కాలిపోవు దీపమౌదు 

తృప్తిగాను....  తల్లీ..


జీవింతు నీ కొరకు..మళ్ళీ

ఏడవకే చిన్నారి పాపా..చిట్టి పాపా 

చూడలేనే కన్నీరు పాపా 


చరణం 2 :


నిన్ను లతలాగ కన్నీట తడిపీ...

పెంచేనమ్మా..

రక్తమాంసాల త్యాగాల ఎరువు... 

వేసేనమ్మా..ఆ

చిగురు వేసి విరులు పూచి... 

చిగురు వేసి విరులు పూచి

మూడుపూవులారుకాయలగుచు 

నీవు నవ్వవలెను

తల్లీ...జీవింతు నీ కొరకు మళ్ళీ 


ఏడవకే చిన్నారి పాపా... 

చిట్టి పాపా

చూడలేనే కన్నీరు పాపా...

నీవు పెరగాలి మరవాలి శోకం... 

రేపు పాడాలి ఆనంద గీతం ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు