నీవు నా ఊహలందే నిలిచావూ
చిత్రం: ఇల్లాలు (1965)
గీతరచయిత: శ్రీ శ్రీ ,
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: పి. సుశీల
పల్లవి :
నీవు నా ఊహలందే నిలిచావూ
నేను నీ కళ్ళలోనే వెలిశానూ
వేయి జన్మాలకైనా విడలేనూ....
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీవు నా ఊహలందే నిలిచావూ
నేను నీ కళ్ళలోనే వెలిశానూ
వేయి జన్మాలకైనా విడలేనూ....
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను
చరణం 1 :
నీవొక చోట నేనొక చోట
అది లోకము పలికే తేలిక మాట
నీవొక చోట నేనొక చోట
అది లోకము పలికే తేలిక మాట
నీవున్న చోటె నిలిచాను నేను
ఏ చోటనున్నా నీవూ నేనూ ఒకటేలే
నీవు నా ఊహలందే నిలిచావూ
నేను నీ కళ్ళలోనె వెలిశానూ
వేయి జన్మాలకైనా విడలేనూ....
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను
చరణం 2 :
నీ మనసే ఒక కోవిల కాగా
నా వలపే ఒక దీపము కా....దా..
నీ మనసే ఒక కోవిల కాగా
నా వలపే ఒక దీపము కా....దా..
దీపము నేనె దీవెన నీవే
దేవుని సాక్షిగ నీవూ నేనూ ఒకటేలే
నీవు నా ఊహలందే నిలిచావూ
నేను నీ కళ్ళలోనె వెలిశానూ
వేయి జన్మాలకైనా విడలేనూ....
నీ ఇల్లాలుగా నేనుంటాను
నీ ఇల్లాలుగా నేనుంటాను
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి