RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

రావోయి చందమామ | Ravoyi Chandamama | Song Lyrics | Missamma (1955)

రావోయి చందమామ



చిత్రం :  మిస్సమ్మ (1955)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం :  ఏ. ఎం. రాజా, పి. లీల


పల్లవి:


రావోయి చందమామ.. 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ.. 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ..


చరణం 1:


సామంతము గల సతికీ 

ధీమంతుడనగు పతినోయ్

సామంతము గల సతికీ 

ధీమంతుడనగు పతినోయ్

సతి పతి పోరే బలమై 

సతమత మాయెను బ్రతుకే


రావోయి చందమామ.. 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ.. 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ


చరణం 2:


ప్రతినలు పలికిన పతితో 

బ్రతుకగ వచ్చిన సతినోయ్

ప్రతినలు పలికిన పతితో 

బ్రతుకగ వచ్చిన సతినోయ్

మాటలు బూటకమాయే 

నటనలు నేర్చెను చాలా


రావోయి చందమామ.. 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ..


చరణం 3:


తన మతమేమో తనదీ.. 

మన మతమసలే పడదోయ్

తన మతమేమో తనదీ.. 

మన మతమసలే పడదోయ్

మనమూ మనదను మాటే 

అననీయదు.. తాననదోయ్


రావోయి చందమామ.. 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ


చరణం 4:


నాతో తగవులు పడుటే 

అతనికి ముచ్చటలేమో

నాతో తగవులు పడుటే 

అతనికి ముచ్చటలేమో

ఈ విధి కాపురమెటులో 

నీవొక కంటను గనుమా


రావోయి చందమామ... 

మా వింత గాథ వినుమా

రావోయి చందమామ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు