RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

16, సెప్టెంబర్ 2025, మంగళవారం

సీతారాముల కల్యాణము | Seetha Ramula Kalyanam | Song Lyrics | Seetha Rama Kalyanam (1961)

సీతారాముల కల్యాణము



చిత్రం :  సీతారామ కల్యాణం (1961)

సంగీతం : గాలిపెంచల నరసింహారావు

గీతరచయిత :  సముద్రాల

నేపధ్య గానం :  సుశీల   


పల్లవి :


సీతారాముల కల్యాణము 

చూతము రారండి

శ్రీ సీతారాముల కల్యాణము 

చూతము రారండి


చరణం 1 :


చూచువారలకు చూడ ముచ్చటట.. 

పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట

చూచువారలకు చూడ ముచ్చటట.. 

పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట 


భక్తి యుక్తులకు ముక్తిప్రదమట 

ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ 

భక్తి యుక్తులకు ముక్తిప్రదమట.. 

సురలను మునులను చూడవచ్చురట

కళ్యాణము చూతము రారండి... 


చరణం 2 :


దుర్జన కోటిని దర్పమడంచగ.. 

సజ్జన కోటిని సంరక్షింపగ

దుర్జన కోటిని దర్పమడంచగ.. 

సజ్జన కోటిని సంరక్షింపగ 


ధారుణి శాంతిని స్థాపన చేయగ

ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ

ధారుణి శాంతిని స్థాపన చేయగ.. 

నరుడై పుట్టిన పురుషోత్తముని

కళ్యాణము చూతము రారండి 


చరణం 3:


దశరథ రాజు సుతుడై వెలసి 

కౌశికు యాగము రక్షణ జేసి

దశరథ రాజు సుతుడై వెలసి 

కౌశికు యాగము రక్షణ జేసి 


జనకుని సభలో హరువిల్లు విరచి

ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ

జనకుని సభలో హరువిల్లు విరచి 

జానకి మనసు గెలిచిన రాముని 


కళ్యాణము చూతము రారండి... 

శ్రీ సీతారాముల కళ్యాణము 

చూతము రారండి

కళ్యాణము చూతము రారండి.. 

శ్రీ సీతారాముల కళ్యాణము 

చూతము రారండి


చరణం 4: 


సిరి కల్యాణపు బొట్టును బెట్టి.. 

బొట్టును బెట్టి

మణిబాసికమును నుదుటను గట్టి.. 

నుదుటను గట్టి

పారాణిని పాదాలకు బెట్టి..ఆ..ఆ.. ఆ ....

పారాణిని పాదాలకు బెట్టి 

పెళ్ళికూతురై వెలసిన సీతా


కల్యాణము చూతము రారండి

శ్రీ సీతారాముల కల్యాణము 

చూతము రారండి 


చరణం 5:


సంపగి నూనెను కురులను దువ్వి.. 

కురులను దువ్వీ

సొంపుగ కస్తూరి నామము తీర్చి.. 

నామము తీర్చి


చెంపగ వాసీ చుక్కను బెట్టి.. 

ఆ.. ఆ.. ఆ....

చెంపగ వాసీ చుక్కను బెట్టి.. 

పెళ్ళి కొడుకై వెలసిన రాముని


కల్యాణము చూతము రారండి

శ్రీ సీతారాముల కల్యాణము 

చూతము రారండి


చరణం 6:


జానకి దోసిట కెంపుల ప్రోవై.. 

కెంపుల ప్రోవై

రాముని దోసిట నీలపు రాశై.. 

నీలపు రాశై


ఆణిముత్యములు తలంబ్రాలుగా...

ఆ.. ఆ ..ఆ.. ఆ ఆ ఆ ....

ఆణిముత్యములు తలంబ్రాలుగా

ఇరవుల మెరసిన సీతారాముల 

కల్యాణము చూతము రారండి


శ్రీ సీతారాముల కల్యాణము 

చూతము రారండీ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు