చుక్కలు పాడే శుభ మంత్రం
చిత్రం : కళ్యాణ మంటపం (1971)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
చుక్కలు పాడే.. శుభ మంత్రం
దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో
పలికిన వేద మంత్రం
ఇక్కడనే.. ఇపుడే.. ఎవరో..
నా చెవిలో ఊదిన మంత్రం..
మధు మంత్రం
చుక్కలు పాడే.. శుభ మంత్రం
చరణం 1 :
రెక్కలపై ఆ గువ్వల జంట ...
రేకులలో ఆ పువ్వుల జంట
రెక్కలపై ఆ గువ్వల జంట...
రేకులలో ఆ పువ్వుల జంట
సాగుచునే.. ఊగుచునే..
మధుర మధురముగ మక్కువగా..
చదువుకునే ఆనంద మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం
చరణం 2 :
కన్నులు ఒక పరి మూసుకొని..
నీవన్నది మరి మరి తలచుకొని
కన్నులు ఒక పరి మూసుకొని..
నీవన్నది మరి మరి తలచుకొని
ఒక్కతినే.. నే నొక్కతినే..
అదే పనిగనే సదా మనసులో
ఆలపించే ప్రియ మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం
చరణం 3 :
కోవెల దైవం పిలిచే దాకా..
ఆవలి ఒడ్డున నిలిచే దాకా
కోవెల దైవం పిలిచే దాకా..
ఆవలి ఒడ్డున నిలిచే దాకా
నాలోనే లోలోనే.. నాతి చరామి..
నాతి చరామి.. అన్న
ఆ ప్రాణ మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం
దిక్కులు నిండే దివ్య మంత్రం
ఎక్కడనో.. ఎపుడో.. ఎవరో
పలికిన వేద మంత్రం
ఇక్కడనే ఇపుడే ఎవరో..
నా చెవిలో ఊదిన మంత్రం
మధు మంత్రం
చుక్కలు పాడే శుభ మంత్రం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి