RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ms viswanathan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ms viswanathan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2026, శనివారం

చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి | Chupullo Chuttesi | Song Lyrics | Oorikichina Mata (1981)

చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి 


చిత్రం  : ఊరికి ఇచ్చిన మాట (1981)

సంగీతం  : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత  : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం  : ఎస్ పి బాలు, పి.సుశీల


పల్లవి :


చూపుల్లో చుట్టేసి.. 

మాటల్లో పట్టేసి.. 

చేతుల్లో కట్టేసినావు

రామ రామ.. పరంధామ.. 

నా గుండె కొట్టుకొనె 

ఝల్లుఝల్లుమని


చూపుల్లో చుట్టేసి.. 

మాటల్లో పట్టేసి.. 

చేతుల్లో కట్టేసినావు

అమ్మదొంగ.. పూలరంగ.. 

నా వొళ్ళు తుళ్లిపడె 

ఝిల్లుఝిల్లుమని

చూపుల్లో చుట్టేసి 

మాటల్లో పట్టేసి 

చేతుల్లో కట్టేసినావు  


చరణం 1 :


 ఆ.. అహాహాహ.. హ.. హా..

ఆహాహా.. ఓహోఓ... 

ఆ... హ... హా..

ఏహేహే...


సెగ రేపే ఈ సమయం.. 

ఎగరేసే బిగి పరువం.. 

లే.. లే.. లెమ్మటుంది

కులుకేసే ఈ నిమిషం.. 

వెనుదీసె నా హృదయం.. 

నో.. నో.. నో.. అంటోంది


సెగ రేపే ఈ సమయం.. 

ఎగరేసే బిగి పరువం 

లే.. లే.. లెమ్మటుంది

కులుకేసే ఈ నిమిషం.. 

వెనుదీసె నా హృదయం.. 

నో.. నో.. నో.. అంటోంది 


హోయ్.. కుదిరెను జత.. 

అహహ.. నవమన్మధ.. 

అహహ

మొదలాయెలే మొన్నటి కథ..

కనరాని మెలికేసి 

నను లాగావు.. ఊ..


చూపుల్లో చుట్టేసి.. 

మాటల్లో పట్టేసి.. 

చేతుల్లో కట్టేసినావు

అమ్మదొంగ.. పూలరంగ.. 

నా వొళ్ళు తుళ్లిపడె  

ఝిల్లుఝిల్లుమని


చరణం 2 :


నడయాడె శశిరేఖ.. 

నా వలపుల తొలిరేఖ.. 

నన్నే లోగొన్నావు

ఎదలోని.. పొదలోన.. 

చదివే ప్రతి పుటలోనా.. 

నీవే దాగున్నావు

నడయాడె శశిరేఖ.. 

నా వలపుల తొలిరేఖ.. 

నన్నే లోగొన్నావు

ఎదలోని.. పొదలోన.. 

చదివే ప్రతి పుటలోనా.. 

నీవే దాగున్నావు


అహహా.. నా పని సరి.. 

ఓ గడసరి.. అహ..

ఆగదు మరి.. సాగిన ఝరి..

నిలువెల్లా పులకింతలు 

నింపేశావు.. ఊ..


చూపుల్లో చుట్టేసి.. 

మాటల్లో పట్టేసి.. 

చేతుల్లో కట్టేసినావు

అమ్మదొంగ.. పూలరంగ.. 

నా వొళ్ళు తుళ్లిపడె  

ఝిల్లుఝిల్లుమని


చూపుల్లో చుట్టేసి.. 

మాటల్లో పట్టేసి.. 

చేతుల్లో కట్టేసినావు

రామ రామ పరంధామ.. 

నా గుండె కొట్టుకొనె 

ఝల్లుఝల్లుమని 


- పాటల ధనుస్సు 


19, మే 2026, మంగళవారం

కుర్రాడనుకొని కునుకులు తీసే | Tolivalapu Tondaralu | Song Lyrics | Chilakamma Cheppindi (1977)

కుర్రాడనుకొని కునుకులు తీసే 


చిత్రం : చిలకమ్మ చెప్పింది (1977)

గీతరచయిత:  ఆచార్య ఆత్రేయ

సంగీతం : M.S విశ్వనాథన్

నేపధ్య గానం : ఎస్ పి బాలు,


పల్లవి:


కుర్రాడనుకొని కునుకులు తీసే

హహ వెర్రిదానికీ పిలుపూ ఊ...

కుర్రాడనుకొని కునుకులు తీసే

వెర్రిదానికీ పిలుపూ..

ఇదే నా మేలుకొలుపు


చరణం 1:


మల్లెలు విరిసే మధువులు కురిసే

లేత సోయగమున్నది నీకు

మల్లెలు విరిసే మధువులు కురిసే

లేత సోయగమున్నది నీకు

దీపమంటి రూపముండి

దీపమంటి రూపముండి

కన్నె మనసే చీకటి చేయకు

కన్నె మనసే చీకటి చేయకు!


కుర్రాడనుకొని కునుకులు తీసే

వెర్రిదానికీ పిలుపూ..

ఇదే నా మేలుకొలుపు


చరణం 2:


వెన్నెల చిలికే వేణువు పలికే

వేళ నీకిది నా తొలి పలుకు

వెన్నెల చిలికే వేణువు పలికే

వేళ నీకిది నా తొలి పలుకు

మూగదైన రాగ వీణ

మూగదైన రాగ వీణ

పల్లవొకటే పాడును చివరకు

పల్లవొకటే పాడును చివరకు!


హహహ కుర్రాడనుకొని 

కునుకులు తీసే

వెర్రిదానికీ పిలుపూ..

ఇదే నా మేలుకొలుపు


- పాటల ధనుస్సు 



1, మార్చి 2026, ఆదివారం

చిలికి చిలికి చిలిపి వయసు | Chiliki Chiliki Chilipi Vayasu | Song Lyrics | Premalu Pellillu (1974)

చిలికి చిలికి చిలిపి వయసు


చిత్రం : ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి:


చిలికి చిలికి చిలిపి వయసు.. 

వలపు వాన అవుతుంది

వలచి వలచి చెలియ మనసు... 

పూల పల్లకి అవుతుంది..ఈ..

పూల పల్లకి అవుతుంది..


హే.. ఓహో.. అహహా.. హా.. అ..

ఆహా.. హా.. ఆ.. ఒహోహో.. ఓ..


చిలికి చిలికి చిలిపి వయసు.. 

వలపు వాన అవుతుంది

వలచి వలచి చెలియ మనసు.. 

పూల పల్లకి అవుతుంది..ఈ..

పూల పల్లకి అవుతుంది..


చరణం 1:


పొంగే కెరటం.. తీరం కోసం.. 

పరుగులు తీస్తుంది..ఈ..

పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. 

దారులు కాస్తుంది

పొంగే కెరటం తీరం కోసం.. 

పరుగులు తీస్తుంది..ఈ..

పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. 

దారులు కాస్తుంది


అందమంతా.. జంట కోసం...

అందమంతా జంట కోసం.. 

ఆరాట పడుతుంది..ఈ..

ఆరాట పడుతుంది


చిలికి చిలికి చిలిపి వయసు.. 

వలపు వాన అవుతుంది

వలచి వలచి చెలియ మనసు.. 

పూల పల్లకి అవుతుంది..ఈ..

పూల పల్లకి అవుతుంది..


చరణం 2:


తుంటరి పెదవి.. జంటను కోరి.. 

తొందర చేస్తుంది..ఈ..

దాచిన తేనెలు దోచే దాక.. 

ఓపనంటుంది

తుంటరి పెదవి.. జంటను కోరి.. 

తొందర చేస్తుంది..ఈ..

దాచిన తేనెలు దోచే దాక.. 

ఓపనంటుంది


రోజు రోజు.. కొత్త మోజు..

రోజు రోజు.. కొత్త మోజు.. 

రుచులేవో ఇస్తుంది..ఈ..

రుచులేవో ఇస్తుంది..


చిలికి చిలికి చిలిపి వయసు.. 

వలపు వాన అవుతుంది..ఈ..

వలచి వలచి చెలియ మనసు.. 

పూల పల్లకి అవుతుంది..ఈ..

పూల పల్లకి ఔతుంది..


హే.. ఏహే.. ఒహోహో.. ఓ..

ఆ.. ఆహహా.. హాహహా.. ఆహహా.. హాహహా..


- పాటల ధనుస్సు 


28, ఫిబ్రవరి 2026, శనివారం

మనసులు మురిసే సమయమిది | Manasulu Murise Samayamidi | Song Lyrics | Premalu Pellillu (1974)

మనసులు మురిసే సమయమిది


చిత్రం :  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి :


మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది

ఆ.. వేళ యిది....  ఆ.. వేళ యిది


చరణం 1 :


లలలల ....లల లాలల... 

లలలల ....లల లాలల

లలలల ....లల లాలల.. 

లలలల ....లల లాలల


 తెలిమబ్బు జంట గగనాల వెంట 

జత జేరుతున్నది

హృదయాలు రెండు యీ తీరమందు 

పెనవేసుకున్నవి


సెలయేటి జంట ఆ కోనలందు 

కలబోసుకున్నది... 

పరువాలు రెండు ఒక దారివెంట 

పయనించుచున్నవి


నీలాల నీ కళ్ళలో...  

నీ రూపమే వున్నది  

నీలాల నీ కళ్ళలో...  

నీ రూపమే వున్నది

ఆశలే .. పెంచుకో ... 

మోజులే ... పంచుకో


మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది... 

పువ్వై విరిసే వేళ యిది


చరణం 2 :


ఈ అంద చందాలలో 

ఈ ప్రేమ బంధాలలో.. 

ఉయ్యాల లూగిందిలే నేడు 

నా జీవితం

ఈ అంద చందాలలో 

ఈ ప్రేమ బంధాలలో... 

ఉయ్యాల లూగిందిలే నేడు 

నా జీవితం


నా సొగసులన్నిఈ నాటినుండి 

నీ సొంతమాయెలే

మన జంట చూసి ఈ లోకమంత 

పులకించి పోవులే


నిండైన మన ప్రేమలు 

నిలిచేను కలకాలము

తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో


మనసులు మురిసే సమయమిది.. 

తనువులు మరిచే తరుణమిది

నీ కౌగిలిలో యవ్వనమంతా 

పువ్వై విరిసే వేళ యిది

ఆ... వేళ యిది ఆ... వేళ యిది...  

పువ్వై విరిసే వేళ యిది 


- పాటల ధనుస్సు 


మనసులేని దేవుడు | Manasuleni Devudu | Song Lyrics | Premalu Pellillu (1974)

మనసులేని దేవుడు


చిత్రం : ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : రామకృష్ణ, 


పల్లవి :


మనసులేని దేవుడు.. 

మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసులేని దేవుడు.. 

మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసు మనసును వంచన చేస్తే... 

కనులకెందుకో నీరిచ్చాడు..

కనులకెందుకో నీరిచ్చాడు

మనసులేని దేవుడు... 

మనిషి కెందుకో మనసిచ్చాడు


చరణం 1 :


మనిషికీ.. దైవానికీ 

ఏనాటి నుంచో వైరము

మనిషికీ.. దైవానికీ 

ఏనాటి నుంచో వైరము

వీడి కోరిక వాడు తీర్చడు... 

వాడి దారికి వీడు వెళ్లడు....

వాడి దారికి వీడు వెళ్లడు

మనసులేని దేవుడు... 

మనిషి కెందుకో మనసిచ్చాడు


చరణం 2 :


ప్రేమనేది ఉన్నదా.. 

అది మానవులకే ఉన్నదా ?

ప్రేమనేది ఉన్నదా ?..  

అది మానవులకే ఉన్నదా ?

హృదయముంటే తప్పదా.. 

అది బ్రతుకు కన్నా గొప్పదా..

అది బ్రతుకు కన్నా గొప్పదా......

మనసులేని దేవుడు ... 

మనిషి కెందుకో మనసిచ్చాడు


చరణం 3 :


ఏమిటో ఈ ప్రేమ తత్వం ?...  

ఎక్కడుందో మానవత్వం

ఏమిటో ఈ ప్రేమ తత్వం?... 

ఎక్కడుందో మానవత్వం

ఏది సత్యం.. ఏది నిత్యం..  

ఏది సత్యం.. ఏది నిత్యం

చివరికంతా శూన్యం.. శూన్యం..

చివరికంతా శూన్యం.. శూన్యం....


మనసులేని దేవుడు.. 

మనిషి కెందుకో మనసిచ్చాడు

మనసు మనసును వంచన చేస్తే... 

కనులకెందుకో నీరిచ్చాడు

కనులకెందుకో నీరిచ్చాడు ... 

కనులకెందుకో నీరిచ్చాడు


- పాటల ధనుస్సు 


25, సెప్టెంబర్ 2025, గురువారం

తోడు నీడ ఎవరులేని ఒంటరి | Thodu Needa Evaruleni Ontari | Song Lyrics | Manchi Chedu (1963)

తోడు నీడ ఎవరులేని ఒంటరి



చిత్రం :  మంచి-చెడు (1963)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్, రామ్మూర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  పి. సుశీల


పల్లవి:


తోడు నీడ ఎవరులేని ఒంటరి..

వాడు లోకమనే పాఠశాల చదువరీ...

చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ...

వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ...

తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ..

చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... 

వాని చిత్తమున మెత్తదనం కలదు మరీ

చిత్తమున మెత్తదనం కలదు మరీ...


చరణం 1:


కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు.. 

కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు

కన్నె సొమ్ము దోచుకొనే చోరుడు... 

కన్నతల్లి అనే మాటవినీ కట్టుబడు

ఉన్నదంత యిచ్చి ఊరడించునూ... 

తానె ఊరు చేరువరకు తోడువచ్చును

ఊరు చేరువరకు తోడు వచ్చును...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ

లోకమనే పాఠశాల చదువరీ...


చరణం 2:


ఆకలైన పులిలాగే ఉరుకును... 

కాని మచ్చికతో మనసు నిచ్చివేయును

కళా హృదయమున్న మేలి రసికుడు... 

సదా కనులలోనే కదలాడే యువకుడు

కనులలోనే కదలాడే యువకుడు...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ

లోకమనే పాఠశాల చదువరీ...


చరణం 3:


రేపు వాని మనసు మార వచ్చును... 

వాడు మాపు మాని పగలు తిరుగ వచ్చును

తల్లి మనసు చల్లదనము తెలియును... 

వాని ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...

ఉల్లమున ప్రేమ మధువు ఒలుకును...


తోడు నీడ ఎవరులేని ఒంటరి.. 

వాడు లోకమనే పాఠశాల చదువరీ..

చీకటిలో బ్రతుకు వెతుకు తెంపరీ... 

వాని చిత్తమున మెత్తదనం కలదుమరీ

చిత్తమున మెత్తదనం కలదుమరీ...


- పాటల ధనుస్సు 


పుడమి పుట్టెను నాకోసం | Pudami Puttenu Naakosam | Song Lyrics | Manchi Chedu (1963)

పుడమి పుట్టెను నాకోసం



చిత్రం :  మంచి-చెడు (1963)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

కడలిపొంగెను నాకోసం.. 

తల్లిఒడినే పరచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

కడలిపొంగెను నాకోసం.. 

తల్లిఒడినే పరచెను నాకోసం


చరణం 1:


నిన్న చీకటి తొలగెనులే.. 

నేడు వెలుగై వెలిగెనులే

నవ్యజీవన ప్రాభాతం.. 

నన్నే రమ్మని పిలిచెనులే

నవ్యజీవన ప్రాభాతం.. 

నన్నే రమ్మని పిలిచెనులే


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


చరణం 2:


ఉదయ భానుని కాంతులలో.. 

గగన మలిదిన రంగులలో

విశ్వశిల్పిని కన్నానూ.. 

వింట వానిని విన్నాను

విశ్వశిల్పిని కన్నానూ.. 

వింట వానిని విన్నాను


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


చరణం 3:


జగతి సకలం నాదైనా.. 

బ్రతుకు పువ్వుల బాటైనా

తల్లిమనసే గుడినాకూ.. 

తల్లి సేవే గురి నాకూ

తల్లిమనసే గుడినాకూ.. 

తల్లి సేవే గురి నాకూ


పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం

కడలి పొంగెను నాకోసం.. 

తల్లిఒడినే పరచెను నాకోసం

పుడమి పుట్టెను నాకోసం.. 

పూలు పూచెను నాకోసం


- పాటల ధనుస్సు 


రేపంటి రూపం కంటి | Repanti Roopam Kanti | Song Lyrics | Manchi Chedu (1963)

రేపంటి రూపం కంటి



చిత్రం :  మంచి-చెడు (1963)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


రేపంటి రూపం కంటి.. 

పూవింటి తూపుల వంటి

నీ కంటి చూపుల వెంట 

నా పరుగంటి


రేపంటి వెలుగే కంటి.. 

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలూ కళలూ 

నీ సొమ్మంటీ... 


చరణం 1:


నా తోడు నీవైయుంటే.. 

నీ నీడ నేనేనంటి

ఈ జంట కంటే వేరే 

లేదు లేదంటి

నా తోడు నీవైయుంటే.. 

నీ నీడ నేనేనంటి

ఈ జంట కంటే వేరే 

లేదు లేదంటి


నీ పైన ఆశలు వుంచి.. 

ఆపైన కోటలు పెంచి

నీ పైన ఆశలు వుంచి.. 

ఆపైన కోటలు పెంచి


నీకోసం రేపూ మాపూ 

వుంటిని నిన్నంటి

రేపంటి రూపం కంటి.. 

పూవింటి తూపుల వంటి

నీ కంటి చూపుల వెంట 

నా పరుగంటి


చరణం 2:


నే మల్లెపువ్వై విరిసి.. 

నీ నల్లని జడలో వెలిసి

నీ చల్లని నవ్వుల కలసి 

వుంటే చాలంటి

నే మల్లెపువ్వై విరిసి.. 

నీ నల్లని జడలో వెలిసి

నీ చల్లని నవ్వుల కలసి 

వుంటే చాలంటి


నీ కాలి మువ్వల రవళి.. 

నా భావి మోహన మురళీ

నీ కాలి మువ్వల రవళి.. 

నా భావి మోహన మురళీ

ఈ రాగ సరళి తరలి 

పోదాం రమ్మంటి


రేపంటి వెలుగే కంటి.. 

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలూ కళలూ 

నీ సొమ్మంటీ... 


చరణం 3:


నీలోని మగసిరితోటి నాలోని 

సొగసులు పోటి

వేయించి నేనే ఓడిపోనీ 

పొమ్మంటి

నేనోడి నీవే గెలిచి నీ గెలుపు 

నాదని తలచి

రాగాలు రంజిళ్లు రోజే 

రాజీ రమ్మంటి...


రేపంటి వెలుగే కంటి.. 

పూవింటి దొరనే కంటి

నా కంటి కలలూ కళలూ 

నీ సొమ్మంటీ...

రేపంటి రూపం కంటి.. 

పూవింటి తూపుల వంటి

నీ కంటి చూపుల వెంట 

నా పరుగంటి


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు