RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
doralu dongalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
doralu dongalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2026, గురువారం

చెప్పాలనుకున్నానూ | Cheppalanukunnanu | Song Lyrics | Doralu Dongalu (1976)

చెప్పాలనుకున్నానూ 


చిత్రం :  దొరలు దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  మల్లెమాల

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


చెప్పాలనుకున్నానూ.. 

చెప్పలేకపోతున్నానూ..

చెప్పాలనుకున్నానూ.. 

చెప్పలేకపోతున్నానూ

కల్లాకపటం తెలియని నన్ను.. 

కన్నులతో కవ్వి౦చవద్దని

చెప్పాలనుకున్నానూ..  

చెప్పలేకపోతున్నానూ


చెప్పకుండ నా మదిలో దూరి..

చిందర వందర చెయ్యొద్దని.. 

రె౦డివ్వాలనుకున్నానూ

రె౦డివ్వాలనుకున్నానూ.. 

ఇవ్వలేక పోతున్నానూ


చరణం 1 :


ఆడుకునే లతల నడుమ.. 

పాడుకునే పూవులమై

ఆడుకునే లతల నడుమ..  

పాడుకునే పూవులమై

పరిసరాల నన్నిటిని 

పరిమళింప చేద్దామని

పరిమళింప చేద్దామని... 

నే చెప్పాలనుకున్నానూ..  

చెప్పలేకపోతున్నానూ


చరణం 2 :


మేలి ముసుగులోని లజ్జ..  

మెట్లు దిగీ వచ్చిందని

మేలి ముసుగులోని లజ్జ..  

మెట్లు దిగీ వచ్చిందని

తెలిసికూడా తెలియనట్లే.. 

ఒదిగుంటే ఒళ్ళుమండి

ఒదిగుంటే ఒళ్ళుమండి.. 

రె౦డివ్వాలనుకున్నానూ.. 

ఇవ్వలేక పోతున్నానూ


చరణం 3 :


అడగకుండ అందించే..  

ఆలి౦గన మధురము

అడగకుండ అందించే..  

ఆలి౦గన మధురము


వద్దంటూ అందుకునే.. 

వలపు మరీ మధురము


అని చెప్పాలనుకున్నాను.. 

అన్నీ చెప్పేశాను

ఇవ్వాలనుకున్నాను.. 

అన్నీ ఇచ్చేశాను


- పాటల ధనుస్సు


23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఏనాడు అనుకోనిదీ | Yenadu Anukonidi | Song Lyrics | Doralu Dongalu (1976)

ఏనాడు అనుకోనిదీ



చిత్రం :  దొరలు దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  మల్లెమాల

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


వెల లేనిది... కల కానిది... ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 1 :


వెన్నెల పొదిగిన దొన్నెలు... కన్నులు

పెదవుల కందించనా.. పరవశ మొ౦దించనా


అందం విరిసిన ఆమని వేళా

విందులు కొదవుండునా.. వింతలు లేకుండునా

వేడుక.. వాడుక.. కాకుండనా...


ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ



చరణం 2 :


కౌగిట అదిమి...  హృదయం చిదిమి

మధువులు కురిపించనా.. 

మదనుని మురిపించనా   


అందని స్వర్గం ముందు నిలిచితే

ఎందుకు పోమ్మ౦దునా.. 

ఇది వేళ కాదందునా

తీరిక.. కోరిక.. లేదందునా



ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

వెల లేనిది.. కల కానిది.. ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు