RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
manchivadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
manchivadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, నవంబర్ 2025, శనివారం

ఈ రేయి కవ్వించింది | Eereyi Kavvinchindi | Song Lyrics | Manchivadu (1974)

ఈ రేయి కవ్వించింది


చిత్రం :  మంచివాడు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఈ రేయి కవ్వించింది.. 

నా మేను పులకించింది

ఈ రేయి కవ్వించింది.. 

నా మేను పులకించింది

రా.. నీలో దాచుకో.. 

నా పరువాలే పంచుకో

రా.. నీలో దాచుకో.. 

నా పరువాలే పంచుకో


చరణం 1:


చిలిపి మనసు నా మాట వినదు.. 

దోరవయసు ఇక ఊరుకోదు

చిలిపి మనసు నా మాట వినదు.. 

దోరవయసు ఇక ఊరుకోదు


మనసు మాటే విందాములే..

మనసు మాటే విందాములే.. 

వయసు ఆటే ఆడేములే


రా.. లోకం మరచిపో.. 

లే ముద్దులలో మురిసిపో

రా..రా లోకం మరచిపో.. 

లే ముద్దులలో మురిసిపో


చరణం 2:


నిండు వలపుల నీ కౌగిలింత.. 

ఉండిపోని జీవితమంతా

నిండు వలపుల నీ కౌగిలింత.. 

ఉండిపోని జీవితమంతా


కెంపు సొంపుల చెంపలు నావే..

కెంపు సొంపుల చెంపలు నావే... 

మధువులూరే అధరాలు నావే


రా.. నాలో నిండిపో.. 

నా అశలనే పంచుకో

రా.. నాలో నిండిపో.. 

నా అశలనే పంచుకో


చరణం 3:


పాలవెన్నెల కురిసేటి వేళ... 

మల్లె పానుపు పిలిచేటి వేళ

పాలవెన్నెల కురిసేటి వేళ... 

మల్లె పానుపు పిలిచేటి వేళ


తనువులొకటై పెనవేసుకోనీ..

తనువులొకటై పెనవేసుకోనీ... 

కన్నులొకటై కథల్లుకోనీ


రా ఎదపై వాలిపో.. 

నా ఒడిలోనే సోలిపో

ఉం... రా ఎదపై వాలిపో.. 

నా ఒడిలోనే సోలిపో

ఈ రేయి కవ్వించింది.. 

నా మేను పులకించింది...


అహహ.. అహా.. ఆ.. ఆ..

అహహ.. అహా.. ఆ.. ఆ..

ఉముముహు.. ఉముముహు.. 

ఉ.. ఉ..

ఉముముహు.. ఉముముహు.. 

ఉ.. ఉ..  


- పాటల ధనుస్సు 


24, నవంబర్ 2025, సోమవారం

అమ్మాయే పుడుతుంది | Ammaye Puduthundi | Song Lyrics | Manchivadu (1974)

అమ్మాయే పుడుతుంది 


చిత్రం :  మంచివాడు (1974)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది

అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది


అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు


చరణం 1:


కోటేరులాంటి ముక్కు 

కోలకళ్ళు..

లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..

చిలిపి నవ్వులు

కోటేరులాంటి ముక్కు... 

కోలకళ్ళు..

లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..

చిలిపి నవ్వులు

ఆ నవ్వుల్లో వస్తాయి 

చిన్ని నొక్కులు..

ఆ నవ్వుల్లో వస్తాయి 

చిన్ని నొక్కులు

..ఆ నొక్కులే తెస్తాయి 

మనకెన్నో సిరులు

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు

అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది


చరణం 2:


దోబూచులాడు కళ్ళు.. 

దొంగ చూపులు...

తియ్యతియ్యని మాటలు... ...

తెలివితేటలు...

దోబూచులాడు కళ్ళు.. 

దొంగ చూపులు...

తియ్యతియ్యని మాటలు... ...

తెలివితేటలు..

ఆ మాటలకే పడతారు 

కన్నె పిల్లలు.. 

ఆ మాటలకే పడతారు 

కన్నె పిల్లలు..

ఈ ఆత్తగారికప్పుడు 

ఎందరమ్మా కోడళ్ళు..

అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు


చరణం 3:


నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...

ఊహు.. మీలాంటి పిల్లాడ్నే 

కంటాను నేను

అహా.. నీలాంటి ఆడపిల్ల 

కావాలి నాకు...

ఊహు.. మీలాంటి పిల్లాడ్నే 

కంటాను నేను..

ఇద్దర్ని కంటె వద్దన్నదెవరు? 

ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో?

హ హా..హా..


అమ్మాయే పుడుతుంది..  

అచ్చం అమ్మలాగే ఉంటుంది

అబ్బాయే పుడతాడు..  

అచ్చం నాన్నలాగే ఉంటాడు

అహా...  అమ్మలాగే ఉంటుంది

ఊహు... నాన్నలాగే ఉంటాడు


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు