RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, మే 2026, మంగళవారం

ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్ | Ellostanoy Mama Mallostanoy | Song Lyrics | Chilipi Krishnudu (1978)

ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్ 


చిత్రం : చిలిపి కృష్ణుడు (1978)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల


పల్లవి :


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను...

హేయ్ 

ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను...


ఎల్లిపోయాననీ ఏడుస్తా కూర్చోకు... 

అయ్యో పాపం

ఎల్లిపోయాననీ ఏడుస్తా  కూర్చోకు

మళ్ళోచేసరికి నన్ను మరచిపోకు..

డుర్..

మామ..మామ..మామ..మామ..


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను 


చరణం 1 :


నిద్దరొచ్చి తొంగొంటే కలనౌతాను

నిదురమాని మేల్కొంటే నిజమౌతాను

నిద్దరొచ్చి తొంగొంటే కలనౌతాను

నిదురమాని మేల్కొంటే నిజమౌతాను


యెనకముందు జనుమలెన్నో 

ఎరిగినట్టె వుంటాను..

ఆ.. ఆ.. యెనకముందు జనుమలెన్నో 

ఎరిగినట్టె వుంటాను

ఎవరూ.. నే ఎవరంటే..

ఎవరు.. నువ్ ఎవరంటే..

వివరంగా చెప్పలేను 


హహహా.. ఎళ్లొస్తానోయ్ మావ 

మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను


చరణం 2 :


గుడి కాడ కలుసుకొన్నాం 

గురుతుందా..

ఈ కొత్తలంగా తెచ్చిచ్చావ్ 

బావుందా

గుడి కాడ కలుసుకొన్నాం 

గురుతుందా..

ఈ కొత్తలంగా తెచ్చిచ్చావ్ 

బావుందా 


మొదటెట్టిన ముద్దు..హాయ్..

మొదటెట్టిన ముద్దు... 

ఇంకా  తియ్యగుందా..

మొదటెట్టిన ముద్దు... 

ఇంకా  తియ్యగుందా..

నీ మొరటుతనం ఇకనైన..  

మారిందా..  మారిందా

మావ..మావ..మావా..మావా..

మావ..మావ..మావా..మావా..


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను


చరణం 3 :


ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ

అది పిచ్చిగా మారుతుంది 

నేనుంటేనూ

ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ

అది పిచ్చిగా మారుతుంది 

నేనుంటేనూ 


ఇంటిదాక ఎంటపడి 

రావొద్దు అంటాను

ఆ..హ్హ.. ఇంటిదాక ఎంటపడి 

రావొద్దు అంటాను

ఎందుకూ?.. నే ఎందుకూ?


ఎందుకంటే ఆడనేను 

దయ్యమల్లె  వుంటాను..హాయ్..హాయ్

మావ..మావ..మావా..మావా..


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను... 

డుర్ర్...

మావ..మావ..మావా..మావా.. 


ఎళ్లొస్తానోయ్ మావ మళ్లొస్తానోయ్..

మళ్లొస్తాను ...  మరి వెళ్లొస్తాను

 

- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు  చిత్రం: అడవిరాముడు (1977) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు