RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, మే 2026, బుధవారం

మెల్ల మెల్ల మెల్లగా | Mella Mella Mellaga | Song Lyrics | Dagudu Muthalu (1964)

మెల్ల మెల్ల మెల్లగా 



చిత్రం: దాగుడుమూతలు (1964) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 


పల్లవి: 


మెల్ల మెల్ల మెల్లగా 

అణువణువు నీదెగా 

మెల్ల మెల్ల మెల్లగా 

అణువణువు నీదెగా 

మెత్తగ అడిగితే 

లేదనేది లేదుగా 

మెత్తగ అడిగితే 

లేదనేది లేదుగా 

మెల్ల మెల్ల మెల్లగా 

అణువణువు నీదెగా 


చరణం 1: 


నీది కానిదేది లేదు నాలో 

నిజానికే నేనున్నది నీలో 

నీది కానిదేది లేదు నాలో 

నిజానికే నేనున్నది నీలో 

ఒక్కటే మనసున్నది ఇద్దరిలో 

ఒక్కటే మనసున్నది ఇద్దరిలో 

ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో 

హా... 


చరణం 2: 


నిన్ను చూచి నన్ను 

నేను మరచినాను 

నన్ను దోచుకొమ్మనీ 

నిలిచినాను 

నిన్ను చూచి నన్ను 

నేను మరచినాను 

నన్ను దోచుకొమ్మనీ 

నిలిచినాను 

దోచుకుందమనే నేను 

చూచినాను 

దోచుకుందమనే నేను 

చూచినాను 

చూచి చూచి నువ్వె 

నన్ను దోచినావు 


చరణం 3: 


కన్నులకు కట్టినావు 

ప్రేమ గంతలు 

కన్నె మనసు ఆడినదీ 

దాగుడు మూతలు 

కన్నులకు కట్టినావు 

ప్రేమ గంతలు 

కన్నె మనసు ఆడినదీ 

దాగుడు మూతలు 

దొరికినాము చివరకు 

తోడు దొంగలం 

దొరికినాము చివరకు 

తోడు దొంగలం 

దొరలమై ఏలుదాము 

వలపు సీమను 

హా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు  చిత్రం: అడవిరాముడు (1977) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు