RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, మే 2026, శుక్రవారం

ఏమివ్వను నీకేమివ్వను | Emivvanu Neekemivvanu | Song Lyrics | Suputrudu (1971)

ఏమివ్వను నీకేమివ్వను


చిత్రం : సుపుత్రుడు (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


ఏమివ్వను నీకేమివ్వను.. 

నా మనసే నీదైతే ఏమివ్వను

ఏమివ్వను నీకేమివ్వను.. 

నా మనసే నీదైతే ఏమివ్వను


నన్నే వలచి నా మేలు తలచి..

నన్నే వలచి నా మేలు తలచి..

లేని కళంకం మోసిన ఓ చెలీ… 

మచ్చలేని జాబిలి

ఏమివ్వను నీకేమివ్వను.. 

నా మనసే నీదైతే ఏమివ్వను


చరణం 1 :


తారకలే కోరికలై మెరియగా 

కనులు విరియగా...

వెన్నెలలే వేణువులై పలుకగా 

మధువు లొలుకగా

యుగయుగాలు నిన్నే వరియించనా

నా సగము మేన నిన్నే ధరియించనా..


ఏమివ్వను నీకేమివ్వను.. 

నా మనసే నీదైతే ఏమివ్వను


ఏమడుగను ఇంకేమడుగను.. 

నీ మనసే నాదైతే ఏమడుగను


చరణం 2 :


నీ కన్నుల వెలుగులే తారకలై... 

నయన తారకలై

నీ నవ్వుల జిలుగులే చంద్రికలై... 

కార్తీక చంద్రికలై

జగమంతా నీవే అగుపించగా...

నీ సగము మేన నేనే నివసించగా


ఏమడుగను ఇంకేమడుగను.. 

నీ మనసే నాదైతే ఏమడుగను

నిన్నే వలచి నీ మేలు తలచి...

నిన్నే వలచి నీ మేలు తలచి

బ్రతుకే నీవై పరవశించు చెలినీ... 

నీ జాబిలినీ


ఏమడుగను ఇంకేమడుగను.. 

నీ మనసే నాదైతే ఏమడుగను

ఆహాహా... ఆహాహా... ఆహాహహా...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమివ్వను నీకేమివ్వను | Emivvanu Neekemivvanu | Song Lyrics | Suputrudu (1971)

ఏమివ్వను నీకేమివ్వను చిత్రం : సుపుత్రుడు (1971) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం : ఘంటసాల, సుశీల పల్లవి : ఏమి...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు