RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, మే 2026, బుధవారం

వెళ్ళిపోతున్నావా అమ్మా | Vellipothunnava Amma | Song Lyrics | Dasara Bullodu (1971)

వెళ్ళిపోతున్నావా అమ్మా 


చిత్రం: దసరా బుల్లోడు (1971)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల


పల్లవి: వెళ్ళిపోతున్నావా..

అమ్మా ... యిల్లు విడిచి 

నన్ను మరచి వెళ్ళిపోతున్నావా


వెళ్ళిపోతున్నావా..

అమ్మా ...యిల్లు విడిచి 

నన్ను మరచి వెళ్ళిపోతున్నావా

వెళ్ళిపోతున్నావా..అమ్మా


చరణం: 1


నువ్వే అమ్మని అన్నే నాన్నని 

అల్లారుముద్దుగా పెరిగానే

ఈ లోకం ఎరుగక బాధే తెలియక 

పసిపాపడిలా పెంచారే

అమ్మా ఏమై పోవాలి..

నేనెలా బ్రతకాలి


వెళ్ళిపోతున్నావా..

అమ్మా ... యిల్లు విడిచి 

నన్ను మరచి వెళ్ళిపోతున్నావా


చరణం: 2


పంపకాలే తలవంపులనీ..

రెండు యిళ్ళను కలుపుతాననీ

పెంపక మిచ్చారానాడు..

ఆ దత్తే నేడు నా దేవుళ్ళను

నడివీధికీ లాగిందమ్మా..

నవ్వుల పాలు చేసిందమ్మా


వెళ్ళిపోతున్నావా..

అమ్మా ... యిల్లు విడిచి 

నన్ను మరచి వెళ్ళిపోతున్నావా


చరణం: 3


ప్రాణం దేహం విడిపోతున్నవి..

పాలమనసూ కన్నీరైనది

ఎవరో పెట్టిన అనలం రగిలీ..

యిందరి మమతలు బలికోరినదీ

అమ్మా ఏమై పోవాలి..

నేనింకెలా బ్రతకాలి

నేఇంకెలా బ్రతకాలి..

ఎలా బ్రతాకాలీ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

వెళ్ళిపోతున్నావా అమ్మా | Vellipothunnava Amma | Song Lyrics | Dasara Bullodu (1971)

వెళ్ళిపోతున్నావా అమ్మా  చిత్రం: దసరా బుల్లోడు (1971) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల పల్లవి: వెళ్ళిపోతున్నావా.. ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు