RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

15, మే 2026, శుక్రవారం

చిలకమ్మా పిలిచింది | Chilakamma Pilichindi | Song Lyrics | Suputrudu (1971)

చిలకమ్మా పిలిచింది 


చిత్రం :  సుపుత్రుడు (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :


చిలకమ్మా పిలిచింది... 

గోరొంకా పలికింది

చిలకమ్మ పిలిచింది... 

చిగురాకు గొంతుతో

గోరొంక వాలింది... 

కొండంత ఆశతో


చిలకమ్మ పిలిచింది... 

చిగురాకు గొంతుతో

గోరొంక వాలింది... 

కొండంత ఆశతో


చిలకమ్మా.... పిలిచింది

గోరొంకా..... పలికింది


చరణం 1 :


ఉరిమేటి మబ్బులే... 

చిరుజల్లు కురిసేది

చెఱలాడు మనసులే... 

చెలిమితో కలిసేది

ఉరిమేటి మబ్బులే... 

చిరుజల్లు కురిసేది

చెఱలాడు మనసులే... 

చెలిమితో కలిసేది


చినదాని బుగ్గలకు... 

సిగ్గెపుడు వచ్చేది

చినదాని బుగ్గలకు... 

సిగ్గెపుడు వచ్చేది

అనుకోని వలపులూ... 

అప్పుడే తెలిసేది  


చిలకమ్మా.... పిలిచింది

గోరొంకా..... పలికింది


చరణం 2 :


ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది... 

దానిమ్మ పువ్వు

కుఱ్ఱతనమంతా ఒలికావు... 

కులుకుల్లోనువ్వు

చలిగాలి వీచింది... 

ప్రాణాలు జివ్వని

అది గిలిగింత పెట్టితే..

అనుకొంటి నువ్వని   


చిలకమ్మా.... పిలిచింది

గోరొంకా..... పలికింది


చరణం 3 :


ఆ కొండ ఈ కోన... 

కలిశాయి మంచులో

నీరెండ తోచింది... 

నీవున్న తావులో

ఆ కొండ ఈ కోన... 

కలిశాయి మంచులో

నీరెండ తోచింది... 

నీవున్న తావులో

ఊగింది మనపడవ... 

వయ్యారి కొలనులో

ఊగింది మనపడవ... 

వయ్యారి కొలనులో

సాగాలి మనబ్రతుకు... 

ఈ తీపి ఊపులో 


చిలకమ్మా పిలిచింది... 

గోరొంకా పలికింది

చిలకమ్మ పిలిచింది... 

చిగురాకు గొంతుతో

గోరొంక వాలింది... 

కొండంత ఆశతో


చిలకమ్మ పిలిచింది... 

చిగురాకు గొంతుతో

గోరొంక వాలింది... 

కొండంత ఆశతో


చిలకమ్మా.... పిలిచింది

గోరొంకా..... పలికింది


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ | Entha Dooramu Adi | Song Lyrics | Ekaveera (1969)

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ  చిత్రం: ఏకవీర (1969) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత:  సి.నారాయణరెడ్డి  నేపథ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల  పల్లవి:...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు