RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, మే 2026, గురువారం

గోరొంకగూటికే చేరావు చిలకా | Goronka Gutike Cheravu | Song Lyrics | Dagudu Muthalu (1964)

గోరొంకగూటికే చేరావు చిలకా 


చిత్రం: దాగుడుమూతలు (1964)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


గోరొంకగూటికే చేరావు చిలకా

గోరొంకగూటికే చేరావు చిలకా

భయమెందుకే నీకు 

బంగారుమొలకా


గోరొంకగూటికే చేరావు చిలకా


చరణం 1:


ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు

అలసివుంటావు మనసు 

చెదరివుంటావు

ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు

అలసివుంటావు మనసు 

చెదరివుంటావు

మా మల్లెపూలు నీకు 

మంచికథలు చెప్పునే

మా మల్లెపూలు నీకు 

మంచికథలు చెప్పునే

ఆదమరిచి ఈ రేయి 

హాయిగా నిదురపో


చరణం 2:


నిలవలేని కళ్ళు 

నిదరపొమ్మన్నాయి

దాగని చిరునవ్వులు 

వద్దన్నాయీ... 

అబ్బ! ఉండన్నాయీ


నిలవలేని కళ్ళు 

నిదరపొమ్మన్నాయి

దాగని చిరునవ్వులు 

వద్దన్నాయీ... 

అబ్బ! ఉండన్నాయీ

పైటచెంగు రెపరెపలు 

పదపద లెమ్మన్నాయి

పైటచెంగు రెపరెపలు 

పదపద లెమ్మన్నాయి

పలుకైనా పలుకవా 

బంగారు చిలకా


గోరొంకగూటికే చేరావు చిలకా

భయమెందుకే నీకు 

బంగారుమొలకా


గోరొంకగూటికే చేరావు చిలకా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు  చిత్రం: అడవిరాముడు (1977) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు