RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

22, మే 2026, శుక్రవారం

అందలం ఎక్కాడమ్మ | Andalam Ekkadamma | Song Lyrics | Dagudu Muthalu (1964)

అందలం ఎక్కాడమ్మ  


చిత్రం: దాగుడుమూతలు (1964)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


అందలం ఎక్కాడమ్మ 

అందకుండా పోయాడమ్మ

ఇంతవాడు ఇంతకు ఇంతై 

ఎంతో ఎదిగిపోయాడమ్మ

అందలం ఎక్కాడమ్మ 

అందకుండా పోయాడమ్మ

ఇంతవాడు ఇంతకు ఇంతై 

ఎంతో ఎదిగిపోయాడమ్మ


చరణం 1:


నిన్న రేతిరి తానూ 

పొన్నచెట్టు నీడా

నిన్న రేతిరి తానూ 

పొన్నచెట్టు నీడా

ఎన్ని ఊసులో చెప్పి 

ఎన్ని బాసలో చేసి

ఎన్ని ఊసులో చెప్పి 

ఎన్ని బాసలో చేసి

ఒడిలోనా ఒదిగినాడమ్మా ఆ ఆ

నా ఎదనిండా నిండినాడమ్మా 

ఆ ఆ ఆ ఆ


చరణం 2:


ఆ మాటలకు నేనూ 

మైమరచిపోయానూ

ఆ మత్తులో కాస్త 

కనుమూసి ఒరిగానూ

ఆ మాటలకు నేనూ 

మైమరచిపోయానూ

ఆ మత్తులో కాస్త 

కనుమూసి ఒరిగానూ

భళ్లునా తెల్లారిపోయెనమ్మా 

ఆ ఓ ఓ ఓ..

ఒళ్లు ఝళ్లునా చల్లారిపోయెనమ్మా


అందాన్ని చూశానమ్మ 

అందలం ఎక్కానమ్మా

ఎంతవాణ్ణి ఎంతనైనా నే 

నీలో ఇమిడిపోతానమ్మా


అందాన్ని చూశానమ్మ 

అందలం ఎక్కానమ్మా

ఎంతవాణ్ణి ఎంతనైనా నే 

నీలో ఇమిడిపోతానమ్మా


చరణం 3:


వెన్నెపూసవంటీ 

కన్నెపిల్ల ఉంటే

వెన్నెపూసవంటీ 

కన్నెపిల్ల ఉంటే

సన్నజాజులే సిరులూ 

మల్లెపువ్వులే మణులు

సన్నజాజులే సిరులూ 

మల్లెపువ్వులే మణులు

నువు లేక కలిమిలేదమ్మా ఆ ఆ

నీకన్నా కలిమి ఏదమ్మా


అందాన్ని చూశానమ్మ 

అందలం ఎక్కానమ్మా

ఎంతవాణ్ణి ఎంతనైనా నే 

నీలో ఇమిడిపోతానమ్మా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

అందలం ఎక్కాడమ్మ | Andalam Ekkadamma | Song Lyrics | Dagudu Muthalu (1964)

అందలం ఎక్కాడమ్మ   చిత్రం: దాగుడుమూతలు (1964) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల  పల్లవి: అందలం ఎక్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు