దేవుడనేవాడున్నాడా
చిత్రం : దాగుడుమూతలు (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి.. కలిగెను సందేహం
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి.. కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని
దేవునికొచ్చెను అనుమానం
మనుషులనే వారున్నారా అని
దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి.. కలిగెను సందేహం
చరణం 1 :
మనసులేని ఈ మనిషిని చూచి
దేవుడు రాయైపోయాడు
ఆ... దేవుడు కనపడలేదని
మనిషి నాస్తికుడైనాడు
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి.. కలిగెను సందేహం
చరణం 2 :
పశువులకన్నా పక్షులకన్నా
మనిషిని మిన్నగ చేశాడు
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి
భూమే నీదని పంపాడు
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధేరాక
బుద్ధికి హృదయం లేక
హృదయానికి బుద్ధేరాక
నరుడే ఈ నరలోకం
నరకం చేశాడు
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి.. కలిగెను సందేహం
చరణం 3 :
తాము నవ్వుతూ నవ్విస్తారు...
కొందరు అందరినీ
తాము నవ్వుతూ నవ్విస్తారు...
కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో
కొందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో
కొందరినీ
నేను నవ్వితే ఈ లోకం...
చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లోకం...
చూసి చూసి నవ్వింది
దేవుడనేవాడున్నాడా అని
మనిషికి.. కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని
దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా....
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి