RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, మే 2026, మంగళవారం

సుప్రభాత సుందరి నీవు | Suprabhata Sundari Neevu | Song Lyrics | Sahasavanthudu (1978)

సుప్రభాత సుందరి నీవు


చిత్రం: సాహసవంతుడు (1978)

గీతరచయిత: వేటూరి,

సంగీతం: కె.వి. మహదేవన్

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


సుప్రభాత సుందరి నీవు 

ఉదయరాగ మంజరి నేను

కలుసుకున్న ప్రతిరోజూ 

కలలు కన్న తొలిరోజు

సుప్రభాత సుందరి నీవు 

ఉదయరాగ మంజరి నేను

కలుసుకున్న ప్రతిరోజూ 

కలలు కన్న తొలిరోజు

కలలు కన్న తొలిరోజు


చరణం 1:


నా వెలుగులు నలుగే పెడితే 

నీ జిలుగులు నేనే చూడాలి

నా సొగసులు సెగ పెడుతుంటే 

నీ మగసిరిను నేనే చూడాలి


నా వెలుగులు నలుగే పెడితే 

నీ జిలుగులు నేనే చూడాలి

నా సొగసులు సెగ పెడుతుంటే 

నీ మగసిరిను నేనే చూడాలి

ఈ చూపుల రాపిడిలో 

ఆ సూర్యుడు ఉదయించాలి

సుప్రభాత సుందరి నీవు 

ఉదయరాగ మంజరి నేను

కలుసుకున్న ప్రతిరోజూ 

కలలు కన్న తొలిరోజు


చరణం 2:


నా పెదవికి దాహం పుడుతుంటే 

నీ పెదవులు నేనే వెదకాలి

నా వయసే వరదైపోతుంటే 

నీ వలపే వంతెన వేయాలి


నా పెదవికి దాహం పుడుతుంటే 

నీ పెదవులు నేనే వెదకాలి

నా వయసే వరదైపోతుంటే 

నీ వలపే వంతెన వేయాలి


ఈ దిక్కుల కలయికలో 

ఆ చుక్కలు రవళించాలి

సుప్రభాత సుందరి నీవు 

ఉదయరాగ మంజరి నేను

కలుసుకున్న ప్రతిరోజూ 

కలలు కన్న తొలిరోజు

కలలు కన్న తొలిరోజు 

కలలు కన్న తొలిరోజు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

సుప్రభాత సుందరి నీవు | Suprabhata Sundari Neevu | Song Lyrics | Sahasavanthudu (1978)

సుప్రభాత సుందరి నీవు చిత్రం: సాహసవంతుడు (1978) గీతరచయిత: వేటూరి, సంగీతం: కె.వి. మహదేవన్ నేపధ్య గానం: బాలు, సుశీల పల్లవి: సుప్రభాత సుందరి నీవ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు