ఎంకొచ్చిందోయి మావా
చిత్రం : దాగుడుమూతలు (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : పి.సుశీల
పల్లవి :
ఎంకొచ్చిందోయి మావా...
ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం...
ఏదో తెచ్చిందోయ్
ఎంకొచ్చిందోయి మావా...
ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం...
ఏదో తెచ్చిందోయ్
చరణం 1 :
గళ్ళకోక నువ్విస్తే...
కట్టుకొన్నదోయ్
నువ్వు కళ్ళతోను కవ్విస్తే...
నవ్వుకొన్నదోయ్
నవ్వులన్ని నాగమల్లి
పూవులన్నదోయ్
నవ్వులన్ని నాగమల్లి
పూవులన్నదోయ్
ఈ నచ్చినోడికే మనసు
ఇచ్చుకొన్నదోయ్... మావా
ఎంకొచ్చిందోయి మావా...
ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం...
ఏదో తెచ్చిందోయ్
చరణం 2 :
మావకూతురనుకొంటూ
మనసుపడితివోయ్
నువ్వు మనసుపడ్డ ఏకమే
తానుకట్టేనోయ్
మావకూతురనుకొంటూ
మనసుపడితివోయ్
నువ్వు మనసుపడ్డ ఏకమే
తానుకట్టేనోయ్
దోసిలితో వలపు నువ్వు
దోచుకొంటివోయ్
దోసిలితో వలపు నువ్వు
దోచుకొంటివోయ్
నీ ఆసికాలు నమ్ముకొని
ఆశపడ్డదోయ్... మావోయ్
ఎంకొచ్చిందోయి మావా...
ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం...
ఏదో తెచ్చిందోయ్
చరణం 3 :
తగువులాడినా చాలు...
తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ...
నగలవంటివోయ్
తగువులాడినా చాలు...
తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ...
నగలవంటివోయ్
తాళిబొట్టు మాత్రమే
తక్కువన్నదోయ్
తాళిబొట్టు మాత్రమే
తక్కువన్నదోయ్
నీ తల్లో నాలుకమల్లే
తానుమెలుగునోయ్... మావా
ఎంకొచ్చిందోయి మావా...
ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం...
ఏదో తెచ్చిందోయ్... మావోయ్
ఎంకొచ్చిందోయి మావా...
ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం...
ఏదో తెచ్చిందోయ్
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి