RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, మే 2026, గురువారం

గోరంకకెందుకో కొండంత అలక | Goronka Kenduko Kondantha | Song Lyrics | Dagudu Muthalu (1964)

గోరంకకెందుకో కొండంత అలక


చిత్రం: దాగుడుమూతలు (1964)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: పి.సుశీల 



పల్లవి:


గోరంకకెందుకో 

కొండంత అలక

అలకలో యేముందో 

తెలుసుకో చిలకా 

గోరంకకెందుకో 

కొండంత అలక 

అలకలో యేముందో 

తెలుసుకో చిలకా

గోరంకకెందుకో 

కొండంత అలక


చరణం 1:


కోపాలలో ఏదో 

కొత్త అర్ధం ఉంది

గల్లంతులో ఏదో 

గమ్మత్తు ఉంది

కోపాలలో ఏదో 

కొత్త అర్ధం ఉంది

గల్లంతులో ఏదో 

గమ్మత్తు ఉంది

ఉరుములు మెరుపులు 

ఊరికే రావులే

ఉరుములు మెరుపులు 

ఊరికే రావులే

వాన జల్లు పడునులే 

మనసు చల్ల పడునులే

వాన జల్లు పడునులే 

మనసు చల్ల పడునులే


చరణం 2:


మాటేమో పొమ్మంది 

మనసేమో రమ్మంది

మాటకు మనసుకు 

మధ్యన తగవుంది


మాటేమో పొమ్మంది 

మనసేమో రమ్మంది

మాటకు మనసుకు 

మధ్యన తగవుంది

తగవు తీరేదాక 

తలుపు తీయెద్దులే

తగవు తీరేదాక 

తలుపు తీయెద్దులే

ఆదమరచి అక్కడే 

హాయిగా నిదరపో


- పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

అందలం ఎక్కాడమ్మ | Andalam Ekkadamma | Song Lyrics | Dagudu Muthalu (1964)

అందలం ఎక్కాడమ్మ   చిత్రం: దాగుడుమూతలు (1964) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: ఘంటసాల, పి.సుశీల  పల్లవి: అందలం ఎక్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు