RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ghantasala devotional songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ghantasala devotional songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, నవంబర్ 2025, మంగళవారం

జగదభిరామా రఘుకులసోమా | Jagadabhirama Raghukula Soma | Song Lyrics | Ramayalam (1971)

జగదభిరామా రఘుకులసోమా



చిత్రం : రామాలయం (1971)

సంగీతం : ఘంటసాల

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


జగదభిరామా రఘుకులసోమా

శరణమునీయవయా....రామా

కరుణను జూపవయా....


జగదభిరామా రఘుకులసోమా

శరణమునీయవయా....రామా

కరుణను జూపవయా....


చరణం 1 :


కౌశికుయాగము కాచితివయ్యా.. 

రాతిని నాతిగ చేసితివయ్యా

కౌశికుయాగము కాచితివయ్యా.. 

రాతిని నాతిగ చేసితివయ్యా


హరివిల్లు విరిచి మురిపించి సీతను.. 

పరిణయమాడిన కళ్యాణరామా

శరణమునీయవయా....రామా... 

కరుణను జూపవయా....


చరణం 2 :


ఒకటే బాణం ఒకటే మాట.. 

ఒకటే సతియని చాటితివయ్యా

ఒకటే బాణం ఒకటే మాట.. 

ఒకటే సతియని చాటితివయ్యా 


కుజనులనణచి సుజనుల బ్రోచిన...

ఆ....ఆ...

కుజనులనణచి సుజనుల బ్రోచిన.... 

ఆదర్శమూర్తివి నీవయ్యా

శరణమునీయవయా....రామా.. 

కరుణను జూపవయ


జగదభిరామా రఘుకులసోమా.. 

శరణమునీయవయా....రామా 

కరుణను జూపవయా....

జయ జయరాం జానకిరాం.. 

జయ జయరాం జానకిరాం

పావననాం మేఘశ్యాం.. 

జయ జయరాం జానకిరాం

 జయ జయరాం జానకిరాం.. 

జయ జయరాం జానకిరాం

జయ జయరాం జానకిరాం.. 

జయ జయరాం జానకిరాం


- పాటల ధనుస్సు 


23, నవంబర్ 2025, ఆదివారం

నీలకంధరా దేవా దీన బాంధవా రారా | Neelakandhara Deva | Song Lyrics | BhuKailash (1958)

నీలకంధరా దేవా దీన బాంధవా రారా 


చిత్రం:  భూకైలాస్ (1958)

సంగీతం:  ఆర్. సుదర్శన్

గీతరచయిత:  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం:  ఘంటసాల


పల్లవి:


జయ జయ మహాదేవా...

శంభో... సదాశివా...

ఆశ్రిత మందారా...

శృతి శిఖర సంచారా...


నీలకంధరా దేవా... 

దీన బాంధవా రారా... 

నన్ను గావరా...

నీలకంధరా దేవా... 

దీన బాంధవా రారా... 

నన్ను గావరా

సత్య సుందరా స్వామీ... 

నిత్య నిర్మలా పాహీ...

సత్య సుందరా స్వామీ... 

నిత్య నిర్మలా పాహీ...

నీలకంధరా దేవా... 

దీనబాంధవా రారా... 

నన్ను గావరా...


చరణం 1:


అన్య దైవమూ గొలువా... ఆ... ఆ...

అన్య దైవమూ గొలువా... 

నీదు పాదమూ విడువా..

అన్య దైవమూ గొలువా... 

నీదు పాదమూ విడువా

దర్శనమ్ము నీరా... 

మంగళాంగా గంగాధరా..

దర్శనమ్ము నీరా... 

మంగళాంగా గంగాధరా

నీలకంధరా దేవా... 

దీన బాంధవా రారా... 

నన్ను గావరా...


చరణం 2:


దేహి అన వరములిడు 

దాన గుణసీమా...

పాహి అన్నను ముక్తినిడు 

పరంధామ....

నీమమున నీ దివ్య 

నామ సంస్మరణ...

ఏమరక చేయదును 

భవ తాపహరణ....

నీ దయామయ దృష్టి 

దురితమ్ము లారా...

వరసుధా వృష్టినా 

వాంఛలీడేరా...

కరుణించు పరమేశ 

దరహాస భాసా...

హర హర మహాదేవ... 

కైలాస వాసా... కైలాస వాసా...


చరణం 3:


ఫాలలోచన నాదు మొరవిని 

జాలిని పూనవయా...

నాగభూషణ నన్ను కావగ 

జాగును సేయకయా...

ఫాలలోచన నాదు మొరవిని 

జాలిని పూనవయా...

నాగభూషణ నన్ను కావగ 

జాగును సేయకయా...


కన్నుల విందుగ భక్తవత్సల 

కానగరావయ్యా...

కన్నుల విందుగ భక్తవత్సల 

కానగరావయ్యా...

ప్రేమ మీరా నీదు భక్తుని 

మాటను నిల్పవయా...

ప్రేమ మీరా నీదు భక్తుని 

మాటను నిల్పవయా

ఫాలలోచన నాదు మొరవిని 

జాలిని పూనవయా...

నాగభూషణ నన్ను కావగ 

జాగును సేయకయా...

శంకరా శివ శంకరా 

అభయంకరా విజయంకరా...

శంకరా శివ శంకరా 

అభయంకరా విజయంకరా...

శంకరా శివ శంకరా 

అభయంకరా విజయంకరా...


- పాటల ధనుస్సు 


10, జులై 2025, గురువారం

శేషశైలావాస శ్రీ వే౦కటేశా | Sheshasailavasa Sri Venkatesha | Song Lyrics | Sri Venkateswara Mahatyam (1960)

శేషశైలావాస శ్రీ వే౦కటేశా



చిత్రం :  శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల   


పల్లవి :


శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. 

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా..

శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. 

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా 


చరణం 1 :


శ్రీదేవి వ౦కకు 

చిలిపిగా చూడకు

అలమేలు మ౦గకు 

అలుక రానీయకు

శ్రీదేవి వ౦కకు 

చిలిపిగా చూడకు

అలమేలు మ౦గకు 

అలుక రానీయకు


ముద్దు సతులీద్దరిని 

ఇరువైపులా జేర్చి

ముద్దు సతులీద్దరిని 

ఇరువైపులా జేర్చి

మురిపి౦చి లాలి౦చి 

ముచ్చటల తేల్చి


శేషశైలావాస శ్రీ వే౦కటేశా...


చరణం 2 :


పట్టుపానుపు పైన 

పవళి౦చర స్వామి

పట్టుపానుపు పైన 

పవళి౦చర స్వామి

భక్తుల౦దరు నిన్ను 

ప్రస్తుతి౦చి పాడ


చిరు నగవులొలుకుచూ 

నిదురి౦చు నీ మోము

చిరు నగవులొలుకుచూ 

నిదురి౦చు నీ మోము

కరువు తీరా కా౦చి 

తరియి౦తుము మేము


శేషశైలావాస శ్రీ వే౦కటేశా..

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా


- పాటల ధనుస్సు 


14, మే 2025, బుధవారం

ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా | Yedukondala Saami | Song Lyrics | Ghantasala

ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా



ప్రైవేట్ ఆల్బం

రచన : రావులపర్తి భద్రిరాజు 

గానం: ఘంటసాల

సంగీతం: ఘంటసాల


సాకి:

 

ఏడుకొండలవాడా వెంకటరమణా

గోవిందా..గోవిందా...


పల్లవి:

 

ఏడుకొండల సామి...

ఎక్కడున్నావయ్యా...

ఎన్నీ మెట్లెక్కినా...

కానరావేమయ్యా ఆఆఆ...

ఏడుకొండల సామి...

ఏడుకొండల సామి...


చరణం 1:


ఆకాశమంటూ ఈ...

కొండా శిఖరమ్ము పై...

ఆకాశమంటూ ఈ...

కొండా శిఖరమ్ము పై...

మనుజులకు దూరంగా...

మసలుతున్నావా...

మనుజులకు దూరంగా...

మసలుతున్నావా...


ఏడుకొండల సామి...

ఏడుకొండలసామి...


చరణం 2:


ఏ చోట గాంచిన...

నీ ఉందు వందురే...

ఏమిటో నీ మాయ...

తెలియకున్నామయ్యా...

ఏ చోట గాంచిన...

నీ ఉందు వందురే...

ఏమిటో నీ మాయ...

తెలియకున్నామయ్యా...

ఈ అడవి దారిలో...

చేయూతనీయవా ఆఆఆ...

ఆ ఆ ఆ ఆ...

ఆ ఆ ఆ ఆ ఆ ఆ...


ఏడుకొండల సామి...

ఏడుకొండలసామి...


చరణం 3:


ఈ అడవి దారిలో...

చేయూతనీయవా...

నీ పాద సన్నిధికి...

మము జేరనీయవా...

నీ పాద సన్నిధికి...

మము జేరనీయవా...

ఏడుకొండల సామి...

ఎక్కడున్నావయ్యా...

ఎన్నీ మెట్లెక్కినా...

కానరావేమయ్యా ఆఆఆ...


ఏడుకొండల సామి...

ఏడుకొండల సామి...


- పాటల ధనుస్సు 


1, సెప్టెంబర్ 2024, ఆదివారం

సింహాచలము మహా పుణ్యక్షేత్రము | Simhachalamu Maha Punya kshetramu | Song Lyrics | Sri Simhachala Kshetra Mahima (1965)

సింహాచలము మహా పుణ్యక్షేత్రము



చిత్రం : శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)

రచన : రాజశ్రీ 

సంగీతం : టి వి రాజు 

గానం : ఘంటసాల, 


పల్లవి :


సింహాచలము మహా పుణ్యక్షేత్రము

సింహాచలము మహా పుణ్యక్షేత్రము

శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము 


సింహాచలము మహా పుణ్యక్షేత్రము

సింహాచలము మహా పుణ్యక్షేత్రము

శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము 


చరణం  1:


ప్రహ్లాదుడు వేడగా  శ్రీహరి కరుణించగా

ప్రహ్లాదుడు వేడగా  శ్రీహరి కరుణించగా

ద్వయరూపాలొకటిగా

ద్వయరూపాలొకటిగా

యుగ యుగాల గురుతుగా

ఆశ్రితులను కావగా వెలసిన 

హరి నిలయము 


సింహాచలము మహా పుణ్యక్షేత్రము

సింహాచలము మహా పుణ్యక్షేత్రము

శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము 


చరణం  2:


ఏచోటను విన్నా హరినామ స్మరణమే......

హరిహరిన్నారాయణా ఆదినారాయణా 

కరుణించి మమ్మేలు కమలలోచనుడా


హరిహరిన్నారాయణా ఆదినారాయణా 

కరుణించి మమ్మేలు కమలలోచనుడా

హరిహరిన్నారాయణా ఆదినారాయణా 

కరుణించి మమ్మేలు కమలలోచనుడా


ఏచోటను కన్నా భక్తుల సందోహమే

ఏచోటను విన్నా హరినామ స్మరణమే

పాపాలను హరియించే దైవ సన్నిధానము 


సింహాచలము మహా పుణ్యక్షేత్రము

సింహాచలము మహా పుణ్యక్షేత్రము

శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము 


చరణం 3:


మ్రొక్కులను ముడుపూలను చెల్లించువారికి

నీవే దిక్కని నమ్మి కొలిచేటివారికి

ఇహ పరములను సమకూర్చే 

భగవానుని నిలయము 


సింహాచలము మహా పుణ్యక్షేత్రము

సింహాచలము మహా పుణ్యక్షేత్రము

శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము 


- పాటల ధనుస్సు 

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

దినకర శుభకరా | Dinakara Shubakara | Song Lyrics | Vinayaka Chavithi (1957)

దినకర శుభకరా



చిత్రం :  వినాయక చవితి (1957)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  సముద్రాల (సీనియర్)

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


దినకరా.. ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ

దినకరా.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ

హే... శుభకరా

దినకర... శుభకరా

దినకర... శుభకరా

దేవా.. ధీనాధారా

తిమిరసంహార

దినకర.. శుభకర



చరణం 1 :


పతిత పావన మంగళదాత

పాప సంతాప లోకహితా..ఆ

పతిత పావన మంగళదాత

పాప సంతాప లోకహిత


బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ

బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా

వివిద వేద విజ్ఞాన నిధాన

వినత లోక పరిపాలక భాస్కరా


దినకర.. శుభకర

దేవా.. ధీనాధారా

తిమిరసంహార

దినకర..

హే.. దినకర

ప్రభో.. దినకర.. శుభకర...


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు