RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, జులై 2025, గురువారం

శేషశైలావాస శ్రీ వే౦కటేశా | Sheshasailavasa Sri Venkatesha | Song Lyrics | Sri Venkateswara Mahatyam (1960)

శేషశైలావాస శ్రీ వే౦కటేశా



చిత్రం :  శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల   


పల్లవి :


శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. 

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా..

శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. 

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా 


చరణం 1 :


శ్రీదేవి వ౦కకు 

చిలిపిగా చూడకు

అలమేలు మ౦గకు 

అలుక రానీయకు

శ్రీదేవి వ౦కకు 

చిలిపిగా చూడకు

అలమేలు మ౦గకు 

అలుక రానీయకు


ముద్దు సతులీద్దరిని 

ఇరువైపులా జేర్చి

ముద్దు సతులీద్దరిని 

ఇరువైపులా జేర్చి

మురిపి౦చి లాలి౦చి 

ముచ్చటల తేల్చి


శేషశైలావాస శ్రీ వే౦కటేశా...


చరణం 2 :


పట్టుపానుపు పైన 

పవళి౦చర స్వామి

పట్టుపానుపు పైన 

పవళి౦చర స్వామి

భక్తుల౦దరు నిన్ను 

ప్రస్తుతి౦చి పాడ


చిరు నగవులొలుకుచూ 

నిదురి౦చు నీ మోము

చిరు నగవులొలుకుచూ 

నిదురి౦చు నీ మోము

కరువు తీరా కా౦చి 

తరియి౦తుము మేము


శేషశైలావాస శ్రీ వే౦కటేశా..

శయని౦చు మా అయ్య 

శ్రీ చిద్విలాసా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు