జీవితమే ఒక ఆట
చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
జీవితమే ఒక ఆట
సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆట
సాహసమే పూబాటా
నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ
ఉండవు మీకూ కన్నీళ్ళూ
అనాధలైనా అభాగ్యులైనా
అంతా నావాళ్ళూ
ఎదురే నాకు లేదు
నన్నెవరూ ఆపలేరు
ఎదురే నాకు లేదు
నన్నెవరూ ఆపలేరు
జీవితమే ఒక ఆట
సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆట
సాహసమే పూబాటా
చరణం 1:
అనాధ జీవులా...ఆ ఆ ఆ...
ఉగాది కోసం...ఊ ఊ ఊ
అనాధ జీవుల ఉగాది కోసం
సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడెసె గుడెసెనూ గుడిగా మలచి
దేవుడిలా నే దిగివస్తా
అనాది జీవుల ఉగాది కోసం
సూర్యుడిలా నే ఉదయిస్తా
గుడెసె గుడెసెనూ గుడిగా మలచి
దేవుడిలా నే దిగివస్తా
బూర్జువాళ్ళకూ భూస్వాములకూ...
బూర్జువాళ్ళకూ భూస్వాములకూ
బూజు దులపకా తప్పదురా
తప్పదురా... తప్పదురా... తప్పదురా...
జీవితమే ఒక ఆట
సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా
సాహసమే పూబాటా
చరణం 2:
న్యాయ దేవతకూ...ఊ ఊ ఊ...
కన్నులు తెరిచే...ఏ ఏ ఏ...
న్యాయ దేవతకు కన్నులు తెరిచే
ధర్మ దేవతను నేనేరా
పేద కడుపులా ఆకలి మంటకు
అన్నదాతనై వస్తారా
న్యాయ దేవతకు కన్నులు తెరిచే
ధర్మ దేవతను నేనేరా
పేద కడుపులా ఆకలి మంటకు
అన్నదాతనై వస్తారా
దోపిడి రాజ్యం... దొంగ ప్రభుత్వం...
దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం
నేల కూల్చకా తప్పదురా
తప్పదురా... తప్పదురా... తప్పదురా...
జీవితమే ఒక ఆట
సాహసమే పూబాటా
జీవితమే ఒక ఆటా
సాహసమే పూబాటా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి