పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : అన్నమాచార్య
గానం : SP బాలసుబ్రహ్మణ్యం,
సాకి :
పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
పల్లవి :
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడాయకావయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడాయకావయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
చరణం 1 :
కోరిమమ్ము నేలినట్టి కులదైవమ
చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడ
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడాయకావయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
చరణం 2 :
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యఔషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాథుడా
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడాయకావయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి