RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జులై 2025, మంగళవారం

నీ అందం నీ పరువం | Nee Andam Nee Paruvam | Song Lyrics | Prema Lekhalu (1977)

నీ అందం నీ పరువం



చిత్రం :  ప్రేమలేఖలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


నీ అందం... నీ పరువం

నీ అందం నీ పరువం 

నాలో దాచుకో

కాలం తెలియని బిగి కౌగిలిలో 

నన్నే దాచుకో..


ఈ అందం ఈ పరువం 

నీకే అంకితం

రేయి పగలు వెన్నెల కాదా 

నీతో జీవితం


చరణం 1 :


వీచే గాలి పూచే పూలు 

గుసగుసలాడాయి

కోరికలన్నీ తీరేదెపుడని 

రెపరెపలాడాయి 

వీచే గాలి పూచే పూలు 

గుసగుసలాడాయి

కోరికలన్నీ తీరేదెపుడని 

రెపరెపలాడాయి


ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు 

కిలకిల నవ్వాయి 


నీ అందం నీ పరువం 

నాలో దాచుకో

రేయి పగలు వెన్నెల కాదా 

నీతో జీవితం


చరణం 2 :


వలచిన నింగి ప్రేయసి కోసం 

వానై కురిసిందీ

ఆ వానకు తడిసిన భూమి గుండెలో 

ఆవిరి ఎగిసిందీ 

వలచిన నింగి ప్రేయసి కోసం 

వానై కురిసిందీ

ఆ వానకు తడిసిన భూమి గుండెలో 

ఆవిరి ఎగిసిందీ 


ఆ కలియికలోనే నింగి నేల 

జతగా మురిసేదీ 


నీ అందం నీ పరువం 

నాలో దాచుకో

కాలం తెలియని బిగి కౌగిలిలో 

నన్నే దాచుకో..


ఈ అందం ఈ పరువం 

నీకే అంకితం

రేయి పగలు వెన్నెల కాదా 

నీతో జీవితం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు