ఏలే ఏలే మరదలా
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : వేటూరి సుందరరామమూర్తి
గానం : SP బాలసుబ్రహ్మణ్యం, సుజాత , అనురాధ,
పల్లవి :
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అః చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
చరణం 1 :
గాటపు గుబ్బలు కథలాగా కులికేవు
మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచు మురిసేవు
వాటపు వలపుల వరదలా
చీటికీ మాటికీ చనకేవు
చీటికీ మాటికీ చనకేవు వట్టి
బూటకాల మాని పోవే బావ
చాలు చాలు నీతోటి అః చాలు
నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
చరణం 2 :
కన్నుల గంటపు కవితలు గిలికేవు
నా ఎద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు
పల్లవి పాదముల దరువుల
కంటికి వంటికి కలిపేవు
కంటికి వంటికి కలిపేవు ఎన్ని
కొంటె లీలలంట కోలో బావ
అః పాడుకో పాట జంట
పాడుకున్న పాట జాజిపూదోట
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అః చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసల
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి