విన్నానులే.. పొంచి విన్నానులే
చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల
పల్లవి:
విన్నానులే.. ఊహుహు
పొంచి విన్నానులే.. ఏమని
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
చరణం 1:
ఉహూహూ హూ హూ
అహాహా ఆ ఆ ఆ ఆ
సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు
పండులాంటి పాపాయిని ఇవ్వు
ఊ ఊ... ఆ ఆ ...
అలసిపోనివ్వను పనులు చేయనివ్వను
అడుగుతీసి అడుగు వేయనివ్వను
ఓహో ఇంటి పనులు
వంట పనులు తమరే చేస్తే...
అయ్యగారి ఉద్యోగం
ఊహుహుహుహు..
హహహహ..విన్నానులే..
పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
చరణం 2:
పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా ఆ ఆ....
పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా..
అయ్యగారివైపు పడదు నీ చూపు
ఇక ముద్దులన్ని పాపకేన రేపు
అరే అంతలోనే వచ్చిందా
తమకు అసూయా
అబ్బాయి తమ పోలిక
ఆ ముద్దులు మీకే
విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
చరణం 3:
తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం
విడిపోని అనురాగబంధం
ఆ ఆ ఆ ఆ...
నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం
పాపాయే మన ఆరోప్రాణం
నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు
పాపాయి మురిపాలే తొలకరి జల్లు
విన్నావులే.. ఊహుహు
పొంచి విన్నావులే.. ఏమని
ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి