RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vinnanule ponchi vinnanule లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vinnanule ponchi vinnanule లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జులై 2025, మంగళవారం

విన్నానులే పొంచి విన్నానులే | Vinnanule Ponchi Vinnanule | Song Lyrics | Prema Lekhalu (1977)

విన్నానులే.. పొంచి విన్నానులే



చిత్రం :  ప్రేమలేఖలు (1977)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి:


విన్నానులే.. ఊహుహు

పొంచి విన్నానులే.. ఏమని

ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ

ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ


విన్నానులే.. పొంచి విన్నానులే

ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ

ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ


చరణం 1:


ఉహూహూ హూ హూ

అహాహా ఆ ఆ ఆ ఆ


సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు

పండులాంటి పాపాయిని ఇవ్వు

ఊ ఊ... ఆ ఆ ...

అలసిపోనివ్వను పనులు చేయనివ్వను

అడుగుతీసి అడుగు వేయనివ్వను


ఓహో ఇంటి పనులు 

వంట పనులు తమరే చేస్తే...

అయ్యగారి ఉద్యోగం 

ఊహుహుహుహు..


హహహహ..విన్నానులే.. 

పొంచి విన్నానులే

ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ

ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ


చరణం 2:


పాపాయే గారాల తోట

మన చిన్నారే నా ముద్దుల మూటా ఆ ఆ....

పాపాయే గారాల తోట

మన చిన్నారే నా ముద్దుల మూటా..


అయ్యగారివైపు పడదు నీ చూపు

ఇక ముద్దులన్ని పాపకేన రేపు


అరే అంతలోనే వచ్చిందా 

తమకు అసూయా

అబ్బాయి తమ పోలిక 

ఆ ముద్దులు మీకే


విన్నానులే.. పొంచి విన్నానులే

ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ

ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ


చరణం 3:


తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం

విడిపోని అనురాగబంధం

ఆ ఆ ఆ ఆ...

నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం

పాపాయే మన ఆరోప్రాణం


నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు

పాపాయి మురిపాలే తొలకరి జల్లు


విన్నావులే.. ఊహుహు

పొంచి విన్నావులే.. ఏమని

ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ

ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు