చమకు చమకు చాం చుట్టుకో
చిత్రం: కొండవీటి దొంగ (1990)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర
పల్లవి:
చిక్ చిక్ చిక్ చిక్... చిక్ చిక్
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
జనకు జనకు చాం
పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
హే.. చనకు చనకు చాం
పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య
చరణం 1:
నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా
కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ
సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు
ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
కథ ముదరగ..
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
హే.. చనకు చనకు చాం
పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య
చరణం 2:
అగ్గి జల్లులా కురిసే వయసే
నెగ్గలేకపోతున్నా
ఈత ముల్లులా యదలో దిగెరో
జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్య
చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసే
మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
ఇక రేపోమాపో ఆపే
ఊపే హుషారుగా
పదపదమని..
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
జనకు జనకు చాం
పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
హే.. చనకు చనకు చాం
పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి