RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kondaveeti donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kondaveeti donga లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జులై 2025, గురువారం

చమకు చమకు చాం చుట్టుకో | Chamaku Chamaku Cham | Song Lyrics | Kondaveeti Donga (1990)

చమకు చమకు చాం చుట్టుకో 



చిత్రం: కొండవీటి దొంగ (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


చిక్ చిక్ చిక్ చిక్... చిక్ చిక్

అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

జనకు జనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ వయ్యారం సయ్యందయ్యా

హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ అయ్యారే తస్సాదియ్యా


చాం చాం చకచాం చకచాం చాం 

త్వరగా ఇచ్చేయ్ నీ లంచం

చాం చాం చకచాం చకచాం చాం 

చొరవే చేసెయ్ మరి కొంచెం


అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

హే.. చనకు చనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


చరణం 1:


నాగ స్వరములా లాగిందయ్యా 

తీగ సొగసు చూడయ్యా

కాగు పొగరుతో రేగిందయ్యా 

కోడె పడగ కాటెయ్యా

మైకం పుట్టే రాగం వింటూ 

సాగేదెట్టాగయ్యా

మంత్రం వేస్తే కస్సు బుస్సు 

ఇట్టే ఆగాలయ్యా

బంధం వేస్తావా అల్లే అందంతో

పందెం వేస్తావా తుళ్ళే పంతంతో

అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా

కథ ముదరగ..


అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

హే.. చనకు చనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


చరణం 2:


అగ్గి జల్లులా కురిసే వయసే 

నెగ్గలేకపోతున్నా

ఈత ముల్లులా యదలో దిగెరో 

జాతి వన్నెదీ జాణ

అంతో ఇంతో సాయం చెయ్య 

చెయ్యందియ్యాలయ్యా

తియ్యని గాయం మాయం చేసే 

మార్గం చూడాలమ్మా

రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో

రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో

ఇక రేపోమాపో ఆపే 

ఊపే హుషారుగా

పదపదమని..


అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

జనకు జనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ వయ్యారం సయ్యందయ్యా

హొయ్యారే హొయ్య హొయ్య 

హొయ్ అయ్యారే తస్సాదియ్యా

అరె చమకు చమకు చాం 

చుట్టుకో చుట్టుకో 

చాన్సు దొరికెరో హొయ్య

హే.. చనకు చనకు చాం 

పట్టుకో పట్టుకో 

చంపె దరువులే వెయ్య


- పాటల ధనుస్సు 


జీవితమే ఒక ఆట | Jeevithame Oka Aata | Song Lyrics | Kondaveeti Donga (1990)

జీవితమే ఒక ఆట



చిత్రం: కొండవీటి దొంగ (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


జీవితమే ఒక ఆట 

సాహసమే పూబాటా

జీవితమే ఒక ఆట 

సాహసమే పూబాటా


నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ 

ఉండవు మీకూ కన్నీళ్ళూ

అనాధలైనా అభాగ్యులైనా 

అంతా నావాళ్ళూ

ఎదురే నాకు లేదు 

నన్నెవరూ ఆపలేరు

ఎదురే నాకు లేదు 

నన్నెవరూ ఆపలేరు


జీవితమే ఒక ఆట 

సాహసమే పూబాటా

జీవితమే ఒక ఆట 

సాహసమే పూబాటా


చరణం 1:


అనాధ జీవులా...ఆ ఆ ఆ...

ఉగాది కోసం...ఊ ఊ ఊ

అనాధ జీవుల ఉగాది కోసం 

సూర్యుడిలా నే ఉదయిస్తా

గుడెసె గుడెసెనూ గుడిగా మలచి 

దేవుడిలా నే దిగివస్తా


అనాది జీవుల ఉగాది కోసం 

సూర్యుడిలా నే ఉదయిస్తా

గుడెసె గుడెసెనూ గుడిగా మలచి 

దేవుడిలా నే దిగివస్తా


బూర్జువాళ్ళకూ భూస్వాములకూ...

బూర్జువాళ్ళకూ భూస్వాములకూ 

బూజు దులపకా తప్పదురా

తప్పదురా... తప్పదురా... తప్పదురా...


జీవితమే ఒక ఆట 

సాహసమే పూబాటా

జీవితమే ఒక ఆటా 

సాహసమే పూబాటా


చరణం 2:


న్యాయ దేవతకూ...ఊ ఊ ఊ...

కన్నులు తెరిచే...ఏ ఏ ఏ...

న్యాయ దేవతకు కన్నులు తెరిచే 

ధర్మ దేవతను నేనేరా

పేద కడుపులా ఆకలి మంటకు 

అన్నదాతనై వస్తారా


న్యాయ దేవతకు కన్నులు తెరిచే 

ధర్మ దేవతను నేనేరా

పేద కడుపులా ఆకలి మంటకు 

అన్నదాతనై వస్తారా

దోపిడి రాజ్యం... దొంగ ప్రభుత్వం...

దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం 

నేల కూల్చకా తప్పదురా

తప్పదురా... తప్పదురా... తప్పదురా...


జీవితమే ఒక ఆట 

సాహసమే పూబాటా

జీవితమే ఒక ఆటా 

సాహసమే పూబాటా


- పాటల ధనుస్సు 


టిప్పు టాపు లుక్కు | Tippu Top Lukku | Song Lyrics | Kondaveeti Donga (1990)

టిప్పు టాపు లుక్కు



చిత్రం: కొండవీటి దొంగ (1990)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, జానకి


పల్లవి:


హు... హా... హే...

హా టిప్పు టాపు లుక్కు

లిప్ మీద క్లిక్కు

ఎప్పుడంటే అప్పుడే రెడీ..

పింగు పాంగు బాడి

జింగు షింగు లేడి

తాకితేనే పిచ్చ తాకిడీ....

లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు

చుక్కలేల చందమామ వీడు

గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు

చెప్పలేను దానికున్న స్పీడు

వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే

రప ప ప ప

పింగు పాంగు బాడి

జింగు షింగు లేడి

తాకితేనే పిచ్చ తాకిడీ....

టిప్పు టాపు లుక్కు

లిప్ మీద క్లిక్కు

ఎప్పుడంటే అప్పుడే రెడీ..


చరణం 1:


చం చం చంచం

చం చం చంచంచంచంచం

చం చం చంచం

చం చం చంచంచంచంచం


వేళ లేని పాళ లేని వెర్రిలో

వేడి బుగ్గలంటుకుంటే వేడుక

జుర్రుకుంటే కుర్రకారు జోరులో

పాల ఈడు పాయసాల కోరికా

సమ్మర్ ఇంటి సాల్టు సందెవేళ బోల్టు

అందమైన స్టార్టు ఆకశాన హల్టు

సొమ్ములప్పుచేసి సోకు చూసుకోనా

సొంతమైన దిచ్చేసి సోమసిల్లి పోనా

షేకు నిన్ను చేసేసి షాక్ చూసుకోనా

బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా

తడి సరకుల ఒడి దూడుకుల

ముడి సరకుల ముడి విడుపులలో హొ...


పింగు పాంగు బాడి

జింగు షింగు లేడి

తాకితేనే పిచ్చ తాకిడీ...

టిప్పు టాపు లుక్కు

లిప్ మీద క్లిక్కు

ఎప్పుడంటే అప్పుడే రెడీ..


చరణం 2:


చం చచంచం చం చచంచం 

చం చచంచంచం...

చం చచంచం చం చచంచం 

చంచంచచంచచంచచం...


మత్తు మత్తు ఊగులాట మధ్యలో

ఎత్తుకున్న పాటకేది పల్లవీ

కొత్త కొత్త కొంగులాట మధ్యలో

మోత్తుకున్నమోజులన్ని పిల్లవీ

పైన కోకోనట్టు లోన చాకిలెట్టు

ఈడు స్పీడ్ జెట్టు ల్యాండ్ కాదు ఒట్టు

కన్నుమాటలన్నేసి నిన్ను కమ్ముకోనా

ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా

చెంప చేతికిచ్చేసి చేమగిల్లి పోనా

తేనే పట్టు ఒగ్గేసి తెప్పెరిల్లి పోనా

కచటతపల కసి వయసుల గచట ఎప్పుడు


చలి ముడి పడునో హొ...

టిప్పు టాపు లుక్కు

లిప్ మీద క్లిక్కు

ఎప్పుడంటే అప్పుడే రెడీ..

పింగు పాంగు బాడి

జింగు షింగు లేడి

తాకితేనే పిచ్చ తాకిడీ..

లక్ కొద్ది చిక్కినాడు చక్కనోడు

చుక్కలేల చందమామ వీడు


గుప్పుమంది గుట్టుగున్న కన్నె ఈడు

చెప్పలేను దానికున్న స్పీడు

వాడితోటి ఈ పూట వాటమైన సైఅట లే

దాదదూదు దీదిదాద...


టిప్పు టాపు లుక్కు

లిప్ మీద క్లిక్కు

ఎప్పుడంటే అప్పుడే రెడీ..

పింగు పాంగు బాడి

జింగు షింగు లేడి

తాకితేనే పిచ్చ తాకిడీ....

హే రపపాపపప రపపాపపప

రంపపాప రంపపాపపా


- పాటల ధనుస్సు 


దేవి శాంభవి దీన బాంధవి | Devi Shambhavi | Prardhana Song Lyrics | Kondaveeti Donga (1990)

దేవి శాంభవి దీన బాంధవి



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: జానకి 


ప్రార్ధన గీతం:


దేవి శాంభవి దీన బాంధవి 

పాహి పార్వతి కృపా సరస్వతి 

దేవి శాంభవి దీన బాంధవి 

పాహి పార్వతి కృపా సరస్వతి 

లోక బాంధవి ప్రాణ దాతవి 

శోక గాధవి కాపాడు శాంభవి 

అశ్రుధారతో నీ కాళ్ళు కడగామా 

రక్త గంగతో పారాణి దిద్దమా 

దేవుడంటి మా ప్రభువు కోసము 

నీవు కోరితే మా ప్రాణమివ్వమా 

శ్రీ దుర్గ కనక దుర్గ కొండ దేవతా 

కొంగుపట్టి అడిగినాము నీ సాహతా...


- పాటల ధనుస్సు 


4, జులై 2025, శుక్రవారం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం | Sri Anjaneyam Prasannanjaneyam | Song Lyrics | Kondaveeti Donga (1990)

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 


చరణం 1: 


సామ అంటే నీకు ప్రేమ 

భామ అంటే నాకు ప్రేమ 

ప్రేమ భిక్ష నాకు పెట్టారా 

ఆకు పూజ నీకు నోము 

సోకు పూజ నాకు నోము 

జంటకింత గంట కొట్టగా 

ముద్దు లేక ముచ్చటాడు 

పొద్దు లేక పొందు లేక 


ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపారా 

మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక 

మోజుపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా 

జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం 

జివ్వుమన్న ఒంట్లో చివుక్కుమంది ప్రాణం 

ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 


చరణం 2: 


కోడెగాలి కొట్టగానే కొంగు జారి కొంప దీసి 

ఒంపు సొపు గంపకెత్తరా 

ఆడాగాలి సోకగానే కక్ష పుట్టి రెచ్చగొట్టి 

కన్నె ఈల కౌగలించిరా 


పూటకకొక్క పువ్వు పెట్టి పూలాబాణం వేసి కొట్టు 

మన్మధుణ్ణి ఆపలేని మత్తు పుట్టేరా 

మాపటేళ మల్లెలెట్టి చీకటేళ చిచ్చు పెట్టు 

పిల్లదాని చూడగానే పిచ్చి పట్టేరా 

పెట్టలేను కామా ఇదేమి ప్రేమ గీతం 

చెప్పలేను రామా మధీయ మౌన భావం 

మంత్ర పుష్పం మనస్సే పఠించు వేళలోన 


శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం


- పాటల ధనుస్సు 


13, డిసెంబర్ 2023, బుధవారం

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ | Kolo Kolamma Galla Koke | Song Lyrics | Kondaveeti Donga (1990)

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ



చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి



పల్లవి:



కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా


చరణం 1:


కొండ కోనల్లో చాటుగా.. ఎత్తు పల్లాలు తెలిసేలే

కంటి కోణాలు సూటిగా.. కొంటె బాణాలు విసిరేలే

సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ

చూపుకే సుళ్ళు తిరిగె నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ

కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో

పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో

సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే

తణక్కు దిన.. 

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా..


కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా


చరణం 2:


మెత్తగా తాకు చూపుకే.. మేలుకున్నాయి సొగసులే

కోత్తగా తాకు గాయమే.. హాయి అన్నాయి వయసులే

కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా

కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా

భరోసాల వీరా రారా... భరిస్తాను నీ సత్తా

శ్రుతేమించు శృంగారంలో... రతే నీకు మేనత్తా


ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు... హద్దులే లేవులే...

తణక్కు దిన

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా


కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

ఏయ్.. చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా

నా ముద్దు పుచ్చుకోవా.. ఆ.. ఆ.. ఆ..


పాటల ధనుస్సు  


10, డిసెంబర్ 2023, ఆదివారం

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో | Shubalekha Rasukunna | Song Lyrics | Kondaveeti Donga (1990)

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో 

అది నీకు పంపుకున్నా అపుడే కలలో 

పుష్యమి పూవ్వుల పూజ చేస్తా 

బుగ్గన చుక్కలతో 

వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో... 


శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో 

శారద మల్లెల పూల జల్లే 

వెన్నెల నవ్వులలో 

శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో... 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో 

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో 


చరణం 1: 


చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి 

కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి 

మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి 

మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి 


మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు 

గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు 

అంతేలే కథంతేలే అదంతేలే ... 


చరణం 2: 


హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి 

ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో 

రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో 

వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో 


వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు 

వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు 

అంతేలే కధంతేలే అదంతేలే...


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు