RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, డిసెంబర్ 2023, బుధవారం

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ | Kolo Kolamma Galla Koke | Song Lyrics | Kondaveeti Donga (1990)

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ



చిత్రం : కొండవీటి దొంగ (1990)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, జానకి



పల్లవి:



కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా


చరణం 1:


కొండ కోనల్లో చాటుగా.. ఎత్తు పల్లాలు తెలిసేలే

కంటి కోణాలు సూటిగా.. కొంటె బాణాలు విసిరేలే

సోకినా నా ఒళ్ళు కోకలో కళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలనూ

చూపుకే సుళ్ళు తిరిగె నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకూ

కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో

పడేశాక వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో

సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే

తణక్కు దిన.. 

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా..


కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. కోరింది ఇచ్చుకోవా


చరణం 2:


మెత్తగా తాకు చూపుకే.. మేలుకున్నాయి సొగసులే

కోత్తగా తాకు గాయమే.. హాయి అన్నాయి వయసులే

కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా

కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా

భరోసాల వీరా రారా... భరిస్తాను నీ సత్తా

శ్రుతేమించు శృంగారంలో... రతే నీకు మేనత్తా


ముద్దు ఆ వైపు... రుద్దు ఈ వైపు... హద్దులే లేవులే...

తణక్కు దిన

కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా.. 

నా ముద్దు పుచ్చుకోవా

లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా

ఘాటుగా కౌగిళ్ళు ఇచ్చి మార్చుకోమంటావా


కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ.. 

కోరింది ఇచ్చుకోవా

ఏయ్.. చేలో నీ సోకులన్ని సోలోగా పాడుకుంటా

నా ముద్దు పుచ్చుకోవా.. ఆ.. ఆ.. ఆ..


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు