RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, డిసెంబర్ 2023, ఆదివారం

పుట్టినరోజు పండగే అందరికి | Puttinaroju Panduge andariki | Song Lyrics | Jeevana Tarangalu (1973)

పుట్టినరోజు పండగే అందరికి



చిత్రం : జీవన  తరంగాలు (1973),

సంగీతం : J V రాఘవులు,

రచన : C నారాయణ  రెడ్డి,

గానం : P సుశీల,


పల్లవి :

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి ఎందరికి...


చరణం: 1

కలిమికేమి వలసినంత ఉన్నా

మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది

ఆ మనసే ఎంత పేదైదైనా

అనురాగపు సిరులు పంచుతుంది

మమత కొరకు తపియించే జీవనం

మమత కొరకు తపియించే జీవనం

దైవమందిరంలా పరమపావ నం

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి... ఎందరికి...


చరణం: 2

పువ్వెందుకు తీగపై పుడుతుంది

జడలోనో గుడిలోనో నిలవాలని

ముత్యమేల కడలిలో పుడుతుంది

ముచ్చటైన హారంలో మెరవాలని

ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని

తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని

తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని

తానున్నా... లేకున్నా...

తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి

పుట్టినరోజు పండగే అందరికి

మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి

ఎందరికి... ఎందరికి...


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

మన భారతంలో కౌరవులు పాండవులు | Mana Bharatamlo | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

 మన భారతంలో కౌరవులు పాండవులు చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు పల్లవి : హే హే రపరపప...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు