RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, డిసెంబర్ 2023, ఆదివారం

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో | Shubalekha Rasukunna | Song Lyrics | Kondaveeti Donga (1990)

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి: 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో 

అది నీకు పంపుకున్నా అపుడే కలలో 

పుష్యమి పూవ్వుల పూజ చేస్తా 

బుగ్గన చుక్కలతో 

వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో... 


శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో 

శారద మల్లెల పూల జల్లే 

వెన్నెల నవ్వులలో 

శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో... 


శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో 

తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో 


చరణం 1: 


చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి 

కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి 

మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి 

మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి 


మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు 

గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు 

అంతేలే కథంతేలే అదంతేలే ... 


చరణం 2: 


హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి 

ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో 

రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో 

వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో 


వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు 

వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు 

అంతేలే కధంతేలే అదంతేలే...


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు