RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, డిసెంబర్ 2023, ఆదివారం

ఓ గోపెమ్మో ఇటు రావమ్మో | O Gopemmo Itu Ravammo | Song Lyrics | Dharmatmudu (1983)

ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో 



చిత్రం: ధర్మాత్ముడు (1983) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి: 


ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో 

ఈ దాసుని తప్పు దండంతో సరి 

మన్నించవమ్మో 


ఓ క్రిష్టయ్యో రాను పోవయ్యో 

నీ గడసరి మాటలు గారడి చేష్టలు 

చాలించవయ్యో... 


చరణం : 1 


సొగసే నీ అలకలు కూడా 

సొగసే ఓ ముద్దుల గుమ్మా 

ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే... 


తెలుసే ఇది రోజూ ఉండే వరసే 

చిరు చీకటి పడితే.. 

కౌగిట చేరగ తపించి తపించి పోతావే? 

న్యాయము కాదిది.. సమయము కాదిది.. 

న్యాయము కాదిది.. సమయము కాదిది.. 


గోపెమ్మో ఇటు రావమ్మో 

ఈ దాసుని తప్పు దండంతో సరి 

మన్నించవమ్మో 


ఓ కృష్టయ్యో రాను పోవయ్యో 

నీ గడసరి మాటలు గారడి చేష్టలు 

చాలించవయ్యో... 


చరణం : 2 


మదిలో తొలిరాతిరి తలపే మెదిలే 

నిను చూస్తూ ఉంటే 

ఎదలో కోరిక తళుక్కు తలుక్కు మంటుంటే... 

ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ 

మురిపము తీరగ హుళక్కి హుళక్కి అవుతాయే 

నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? 

నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? 


గోపెమ్మో.. ఊ.. ఇటు రావమ్మో 

ఈ దాసుని తప్పు దండంతో సరి 

మన్నించవమ్మో 

ఈ దాసుని తప్పు దండంతో సరి 

మన్నించవమ్మో 


ఓ కృష్టయ్యో రాను పోవయ్యో 

నీ గడసరి మాటలు గారడి చేష్టలు 

చాలించవయ్యో... 

నీ గడసరి మాటలు గారడి చేష్టలు 

చాలించవయ్యో... 


ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో 

ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో 

ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు