RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, డిసెంబర్ 2023, శుక్రవారం

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో | Ee Nallani Ralalo | Song Lyrics | Amarasilpi Jakkana (1964)

ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో 



చిత్రం: అమరశిల్పి జక్కన (1964) 

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 

గీతరచయిత : సినారె

నేపధ్య గానం: ఘంటసాల 


పల్లవి: 


ఓహో ఓ ఓ.... 

ఓహోహో.... 

ఓ ఓ.... 


ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో 

ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ఓ .. ఓ .. 


చరణం 1: 


పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి 

పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి 

మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ..


ఈ నల్లని రాలలో 


చరణం 2: 


కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు 

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు 

ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనే.... 

ఉలి అలికిడి విన్నంతనె జల జలమని పొంగి పొరలు ..


ఈ నల్లని రాలలో.. 


చరణం 3: 


పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును 

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును 

జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ..


ఈ నల్లని రాలలో.


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు