ఎన్నాళ్ళీ తలపులు
చిత్రం : చల్ మోహన రంగ (1978)
సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఎన్నాళ్ళీ తలపులు...
కలల మేలుకొలుపులు
ఎగిసిపడే హృదయంలో
ఘడియ పడని తలుపులు
ఎన్నాళ్లీ పిలుపులు....
మూసిన కనుకొలకులు
ఎన్నాళ్లీ పిలుపులు....
మూసిన కనుకొలకులు
నువు నడిచే బాటలో ...
తీయని తొలి మలుపులు
ఎన్నాళ్ళీ తలపులు...
ఎన్నాళ్లీ పిలుపులు
చరణం 1 :
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా
చిరునవ్వులలు వెన్నెలకే..
కొత్త సిగ్గు నేర్పేనా
కొత్త సిగ్గు నేర్పేనా
నిదుర రాదు... నిదుర రాదు...
నిదుర రాదు... నిదుర రాదు...
నిను చూసిన కనులకు
ఎన్నాళ్ళీ తలపులు...
ఎన్నాళ్లీ పిలుపులు
చరణం 2 :
ఆమని నీ కౌగిలో...
అలసి నిలిచి పోయేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆమని నీ కౌగిలో...
అలసి నిలిచి పోయేనా
ఏమని నా మనసు నన్నే ...
విసిగి వేసరించేనా
విసిగి వేసరించేనా
విడిది చేసే మధుమాసం
విడిది చేసే మధుమాసం
చల్లని నీ లే ఎదలో...
చల్లని నీ లే ఎదలో...
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు... ఎన్నాళ్లీ పిలుపులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి