RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, జులై 2025, శుక్రవారం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం | Sri Anjaneyam Prasannanjaneyam | Song Lyrics | Kondaveeti Donga (1990)

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం



చిత్రం: కొండవీటి దొంగ (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి: 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 


చరణం 1: 


సామ అంటే నీకు ప్రేమ 

భామ అంటే నాకు ప్రేమ 

ప్రేమ భిక్ష నాకు పెట్టారా 

ఆకు పూజ నీకు నోము 

సోకు పూజ నాకు నోము 

జంటకింత గంట కొట్టగా 

ముద్దు లేక ముచ్చటాడు 

పొద్దు లేక పొందు లేక 


ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపారా 

మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక 

మోజుపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా 

జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం 

జివ్వుమన్న ఒంట్లో చివుక్కుమంది ప్రాణం 

ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన 


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 


చరణం 2: 


కోడెగాలి కొట్టగానే కొంగు జారి కొంప దీసి 

ఒంపు సొపు గంపకెత్తరా 

ఆడాగాలి సోకగానే కక్ష పుట్టి రెచ్చగొట్టి 

కన్నె ఈల కౌగలించిరా 


పూటకకొక్క పువ్వు పెట్టి పూలాబాణం వేసి కొట్టు 

మన్మధుణ్ణి ఆపలేని మత్తు పుట్టేరా 

మాపటేళ మల్లెలెట్టి చీకటేళ చిచ్చు పెట్టు 

పిల్లదాని చూడగానే పిచ్చి పట్టేరా 

పెట్టలేను కామా ఇదేమి ప్రేమ గీతం 

చెప్పలేను రామా మధీయ మౌన భావం 

మంత్ర పుష్పం మనస్సే పఠించు వేళలోన 


శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం 

బ్రహ్మచారి భరించ లేడు గాయం 

ప్రేమ గుళ్ళో ఇవ్వాళా పెళ్లి ఖాయం 

స్వామి నిన్నే స్మరించి వరిస్తే అదే 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 

చేసిపెట్టు సాయం జయం 

నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం 

నా ప్రేమ గేయం ప్రియం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు