RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
pooja phalam songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
pooja phalam songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, సెప్టెంబర్ 2026, గురువారం

ఇది చల్లని వేళైనా | Idi Challani Velaina | Song Lyrics | Pooja Phalam (1964)

ఇది చల్లని వేళైనా 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దేవులపల్లి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి :


నేరుతునో లేదో ప్రభూ... 

నీ పాటలు పాడా...


ఇది చల్లని వేళైనా... 

ఇది వెన్నెల రేయైనా

నిదుర రాదు కనులకు... 

శాంతి లేదు మనసుకు

మదిలో వేదన ఏదో... 

కదలే రాధకు

ఇది చల్లని వేళైనా...


చరణం 1:


నీ దయలాగున వెన్నెల...

జగమంతా ముంచే

నీ మధుర ప్రేమా..

యమున కడలంతా నించే

మరి మరి ముల్లోకములను...

మురిపించే స్వామీ

మనసు చల్లబడ...

కనిపించవేమీ


ఇది చల్లని వేళైనా


చరణం 2 :


నీ వేణువు కోసం...

బ్రతుకంతా వీనులాయే

నీ దర్శనమునకై...

ఒడలంతా కనులాయే

బడలే బ్రతుకున ఆశలు...

వెలిగించే దేవా

కదలే వీణియ తీగలు...

సవరించి పోవా


ఇది చల్లని వేళైనా...

ఇది వెన్నెల రేయైనా


- పాటల ధనుస్సు


ఎందు దాగి ఉన్నావో బృందావిహారి | Endu Daagi Vunnavo | Song Lyrics | Pooja Phalam (1964)

ఎందు దాగి ఉన్నావో బృందావిహారి 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆ..ఆ

నిను గానకా...మనజాలరా..

ఆ..ఆ.ఆ


ఎందు దాగి ఉన్నావో 

బృందావిహారి...

ఈ..బృందావిహారి

నీ పాదధూళినై 

నిలువనీయవోయి...

ఎందు దాగి ఉన్నావో 

బృందావిహారి... 

బృందావిహారి..


చరణం 1:


తీసిన గంధపు.. 

వాసనలారెను

అల్లిన దండల ..

మల్లెలు వాడెను

కన్నయ్య నీ సన్నిధి కరవై..

కన్నయ్య నీ సన్నిధి కరవై..

ఘడియే యుగమై పోయెనురా...

ఎందు దాగి ఉన్నావో 

బృందావిహారి...

ఈ..బృందావిహారి..


- పాటల ధనుస్సు 


8, ఆగస్టు 2026, శనివారం

నిన్నలేని అందమేదో | Ninnaleni Andamedo | Song Lyrics | Pooja Phalam (1964)

నిన్నలేని అందమేదో 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:


నిన్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదుర లేచెనెందుకో

తెలియరాని రాగమేదో 

తీయ సాగెనెందుకో... 

తీయ సాగెనెందుకో.. నాలో...

నిన్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదుర లేచెనెందుకో


చరణం 1:


పూచిన ప్రతి తరువొక వధువూ

పువుపువ్వున పొంగెను మధువు

ఇన్నాళ్ళీ శోభలన్నీ 

ఎచట దాగెనో


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

నిదురలేచెనెందుకో


చరణం 2:


తెలి నురుగులె నవ్వులుకాగా

సెలయేరులు కులుకుతు రాగా

కనిపించని వీణలేవో 

కదలి మ్రోగెనే


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదురలేచెనెందుకో


చరణం 3:


పసిడి అంచు పైట జారా

ఆ... ఓ...

పయనించే మేఘ బాల

అరుణ కాంతి సోకగానే 

పరవశించెనే


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

నిదురలేచెనెందుకో....


- పాటల ధనుస్సు 


3, ఆగస్టు 2026, సోమవారం

మదనా మనసాయెరా | Madana Manasayera | Song Lyric | Pooja Phalam (1964)

మదనా మనసాయెరా 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఎస్. జానకి


పల్లవి:


ఓ..ఓ..ఓ..మదనా మనసాయెరా...

పరువము పొంగే తరుణము నేడే

మరి మరి నీకై రాబోదురా...

మదనా.... మనసాయెరా....


చరణం 1:


ఆ..ఆ.. 

సుందరి మధువై ముందు నిలిచెరా

నీ.. ముందు నిలిచెరా..ఆ..

అందిన పెన్నిధి అనుభవించరా..ఆ..

కలువను మీరే చెలువను చేరె ...

కలువను మీరే చెలువను చేరె ..

వలపును తూచే వేళయెరా ...


మదనా మనసాయెరా ...

పరువము పొంగే తరుణము నేడే ...

మరి మరి నీకై రాబోదురా...

మదనా... మనసాయెరా...


- పాటల ధనుస్సు 


28, జులై 2026, మంగళవారం

సుందర సురనందన | Sundara Suranandana | Song Lyrics | Pooja Phalam (1964)

సుందర సురనందన


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి:


సుందర సురనందన 

వన మల్లి.... జాబిల్లి..


అందేనా ఈ చేతుల 

కందేనా...ఆ..

అందేనా ఈ చేతుల 

కందేనా..ఆ..ఆ..

చందమామ ఈ కనులకు 

విందేనా...ఆ..ఆ..

అందేనా ఈ చేతుల కందేనా...


చరణం 1:


ఆ మడుగున కనిపించి...

నా మనసున నివశించి

అంతలోనే ఆకాశపు 

అంచుల విహరించె...ఏ...

చందమామ ఈ కనులకు 

విందేనా ..ఆ..ఆ..ఆ..


చరణం 2:


తలపు దాటనీక మనసు 

తలుపు వేయగలను గాని....

నింగి పైకి ఆశలనే 

నిచ్చెనేయగలను గాని...

కొలనులోన కోర్కెలనే 

అలలపైన ఊగే...

కలువ పేద బ్రతుకులోన 

వలపు తేనె నింపేనా ....

ఆ..ఆ..ఆ..

చందమామ ఈ కనులకు 

విందేనా....ఆ..ఆ..ఆ


- పాటల ధనుస్సు 


శివ దీక్షా పరురాలనురా | Shiva Deeksha Paruralanura | Song Lyrics | Pooja Phalam (1964)

శివ దీక్షా పరురాలనురా 


చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : ఘనం శీనయ్య

నేపధ్య గానం : ఎస్ జానకి


పల్లవి : 


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ..

శివ దీక్షా పరురాలనురా

నే శివ దీక్షా పరురాలనురా


శీలమింతైనా విడువ జాలనురా

నే... శీలమింతైనా విడువ జాలనురా

నే... శీలమింతైనా విడువ జాలనురా

నే... శివ దీక్షా పరురాలనురా


చరణం 1 :


శివ శివ గురునాజ్ఞ మీరనురా

శివ శివ గురునాజ్ఞ మీరనురా

శ్రీ వైష్ణవుడంటే చేరనురా

నే.. ... 

శ్రీ వైష్ణవుడంటే చేరనురా

నే...  శివ దీక్షా పరురాలనురా


చరణం 2 :


వడిగా వచ్చి మఠము చొరవకురా

వడిగా వచ్చి మఠము చొరవకురా 

శివార్చన వేళా.. 

ఆ..  తలుపు తెరవకురా

శివార్చన వేళా... 

నా మడుగు తావి చెరగు తీయకురా

మడుగు తావి చెరగు తీయకురా


మాటి మాటికీ నోరు మూయకురా

ఆ.. ఆ.. ఆ.. మాటి మాటికీ 

నోరు మూయకురా


తధీంతకిట... 

తకతకిటధీం..తోమ్

తా.. తోం తోం ధా.. 

తోంతోం తత్ ధత్

ధికతోం..  ధీం తకితతికధా...

ధణక్ థ...  తియ్యం.. 

తత్ తత్ థా.. ధణం.. 


శివ దీక్షా పరురాలనురా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు