RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sv rangarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sv rangarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, సెప్టెంబర్ 2026, మంగళవారం

ధనమేరా అన్నిటికి మూలం | Dhanamera Annitiki Moolam | Song Lyrics | Lakshmi Nivasam (1968)

ధనమేరా అన్నిటికి మూలం 


చిత్రం: లక్ష్మీ నివాసం (1968)

సంగీతం: కె.వి.మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: ఘంటసాల


పల్లవి :


ధనమేరా అన్నిటికి మూలం

ఆ ధనము విలువ తెలుసుకొనుట 

మానవ ధర్మం

ధనమేరా అన్నిటికి మూలం


చరణం 1 :


మానవుడే ధనమన్నది 

స్రుజియించెనురా

దానికి తానే తెలియని దాసుడాయెరా

ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే

గుణవంతుడు బలవంతుడు 

భగవంతుడురా


ధనమేరా అన్నిటికి మూలం


చరణం 2 :


ఉన్ననాడు తెలివికలిగి 

పొదుపుచేయరా

లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా

కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే

హయ్యో కూలి పోవు కాపురాలు 

ఇది తెలియకుంటే..


ధనమేరా అన్నిటికీ మూలం


చరణం 3 :


కూలివాని చెమటలో ధనమున్నదిరా

పాలికాపు కండల్లొ ధనమున్నదిరా

శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం

ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం


ధనమేరా అన్నిటికి మూలం

ఆ ధనము విలువ తెలుసుకొనుట 

మానవ ధర్మంం


- పాటల ధనుస్సు


27, మార్చి 2025, గురువారం

అనుబంధం ఆత్మీయత | Anubandham Atmeeyatha | Song Lyrics | Tata Manavadu (1973)

అనుబంధం ఆత్మీయత



చిత్రం :  తాతా మనవడు (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం :  రామకృష్ణ 


పల్లవి :


అనుబంధం ఆత్మీయత 

అంతా ఒక బూటకం

ఆత్మతృప్తికై మనుషులు 

ఆడుకొనే నాటకం.. 

వింతనాటకం అనుబంధం


అనుబంధం ఆత్మీయత 

అంతా ఒక బూటకం

ఆత్మతృప్తికై మనుషులు 

ఆడుకొనే నాటకం.. 

వింతనాటకం అనుబంధం  


చరణం 1 :


ఎవరు తల్లి ఎవరు కొడుకు..  

ఎందుకు ఆ తెగని ముడి?

కొనవూపిరిలో ఎందుకు 

అణగారని అలజడి

ఎవరు తల్లి ఎవరు కొడుకు..  

ఎందుకు ఆ తెగని ముడి?


కొనవూపిరిలో ఎందుకు 

అణగారని అలజడి

కరిగే కొవ్వొత్తిపై.. కనికరం 

ఎవ్వడికీ.. ఎవ్వడికీ

అది కాలుతున్నా వెలుగులే - 

కావాలి అందరికీ. . అందరికీ       


అనుబంధం ఆత్మీయత 

అంతా ఒక బూటకం

ఆత్మతృప్తికై మనుషులు 

ఆడుకొనే నాటకం. . 

వింతనాటకం అనుబంధం


చరణం 2 : 


కొడుకంటూ నీకూ 

వొకడున్నాడూ - 

వాడు గుండెను ఏనాడో 

అమ్ముకున్నాడూ

నిన్ను కడసారైనా 

చూడరాలేదూ - 

వల్లకాటికైనా వస్తాడను 

ఆశలేదూ

ఎవరమ్మా వినేది 

నీ ఆత్మఘోషనూ - 

ఏతల్లీ కనగూడదు 

ఇలాంటి కొడుకునూ 


అనుబంధం ఆత్మీయత 

అంతా ఒక బూటకం

ఆత్మతృప్తికై మనుషులు 

ఆడుకొనే నాటకం. . 

వింతనాటకం అనుబంధం


చరణం 3  : 


కానివారి ముచ్చటకై.. 

కలవరించు మూఢునికీ

కన్నవారి కడుపుకోత.. 

ఎన్నడైనా తెలిసేనా

తారాజువ్వల వెలుగుల 

తలతిరిగిన వున్మాదికీ

చితిమంటల చిటపటలు 

వినిపించేనా?  . . 

చితిమంటల చిటపటలు 

వినిపించేనా?  


అనుబంధం ఆత్మీయత 

అంతా ఒక బూటకం

ఆత్మతృప్తికై మనుషులు 

ఆడుకొనే నాటకం..  

వింతనాటకం అనుబంధం


- పాటల ధనుస్సు 


2, జనవరి 2024, మంగళవారం

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ | Idigo Devudu Chesina Bomma | Song Lyrics | Pandanti Kapuram (1972)

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ



చిత్రం: పండంటి కాపురం (1972)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: మైలవరపు గోపి

నేపధ్య గానం:  కోదండపాణి, సుశీల


పల్లవి : 


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

ఇది నిలిచేదేమో మూడు రోజులు... 

బంధాలేమో పదివేలు 


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

ఇది నిలిచేదేమో మూడు రోజులు ...

బంధాలేమో పదివేలు...


చరణం: 1 


నదిలో నావ ఈ బ్రతుకు... 

దైవం నడుపును తన బసకు

ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ   

నదిలో నావ ఈ బ్రతుకు.... 

దైవం నడుపును తన బసకు

అనుబంధాలు ఆనందాలు... 

తప్పవులేరా కడవరకు

తప్పవులేరా కడవరకు....


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

ఇది నిలిచేదేమో మూడు రోజులు... 

బంధాలేమో పదివేలు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...


చరణం: 2 


రాగం ద్వేషం రంగులురా...  

భోగం భాగ్యం తళుకేరా

ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

రాగం ద్వేషం రంగులురా... 

భోగం భాగ్యం తళుకేరా

కునికే దీపం తొణికే ప్రాణం... 

నిలిచేకాలం తెలియదురా

నిలిచేకాలం తెలియదురా....


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ.... 

ఇది నిలిచేదేమో మూడు రోజులు... 

బంధాలేమో పదివేలు....

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...


పాటల ధనుస్సు 

1, జనవరి 2024, సోమవారం

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ | Babu Vinara | Song Lyrics | Pandanti Kapuram (1972)

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ



చిత్రం: పండంటి కాపురం (1972)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: దాశరధి 

నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి: 


బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

కలతలు లేనీ..నలుగురు కలిసీ..

సాగించారు పండంటి కాపురం

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ


చరణం 1: 


ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

ఆఆ ఆఆ ఆఆ...ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....

ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

అన్నంటే తమ్ములకు అనురాగమే...

అన్నకు తమ్ములంటే అనుబంధమే...

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..


చరణం 2: 


చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..

చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..

పిల్లలకూ..పెద్దలకూ..తల్లివంటిదీ..

ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..


చరణం 3:


అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ

తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు

పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ

కలకాలం ఈలాగే కలసివుండాలీ

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

కలతలు లేనీ..నలుగురు కలిసీ..

సాగించారు పండంటి కాపురం..

ఆఆ...ఆఆ...ఓఓఓ...ఓఓఓ..


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కళ్ళతో కాటేసి | Kallatho Katesi | Song Lyrics | Kanna Koduku (1973)

కళ్ళతో కాటేసి  చిత్రం : కన్నకొడుకు (1973) సంగీతం : టి. చలపతిరావు గీతరచయిత : దాశరథి నేపథ్య గానం : ఘంటసాల, పి. సుశీల పల్లవి : కళ్ళతో కాటేసి......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు