RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
babu vinara annadammula katha okati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
babu vinara annadammula katha okati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2024, సోమవారం

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ | Babu Vinara | Song Lyrics | Pandanti Kapuram (1972)

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ



చిత్రం: పండంటి కాపురం (1972)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: దాశరధి 

నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి: 


బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

కలతలు లేనీ..నలుగురు కలిసీ..

సాగించారు పండంటి కాపురం

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ


చరణం 1: 


ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

ఆఆ ఆఆ ఆఆ...ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....

ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

అన్నంటే తమ్ములకు అనురాగమే...

అన్నకు తమ్ములంటే అనుబంధమే...

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..


చరణం 2: 


చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..

చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..

పిల్లలకూ..పెద్దలకూ..తల్లివంటిదీ..

ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..


చరణం 3:


అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ

తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు

పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ

కలకాలం ఈలాగే కలసివుండాలీ

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

కలతలు లేనీ..నలుగురు కలిసీ..

సాగించారు పండంటి కాపురం..

ఆఆ...ఆఆ...ఓఓఓ...ఓఓఓ..


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కళ్ళతో కాటేసి | Kallatho Katesi | Song Lyrics | Kanna Koduku (1973)

కళ్ళతో కాటేసి  చిత్రం : కన్నకొడుకు (1973) సంగీతం : టి. చలపతిరావు గీతరచయిత : దాశరథి నేపథ్య గానం : ఘంటసాల, పి. సుశీల పల్లవి : కళ్ళతో కాటేసి......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు