RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, జనవరి 2024, సోమవారం

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ | Babu Vinara | Song Lyrics | Pandanti Kapuram (1972)

బాబూ వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ



చిత్రం: పండంటి కాపురం (1972)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: దాశరధి 

నేపధ్య గానం: ఘంటసాల



పల్లవి: 


బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

కలతలు లేనీ..నలుగురు కలిసీ..

సాగించారు పండంటి కాపురం

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ


చరణం 1: 


ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

ఆఆ ఆఆ ఆఆ...ఓ ఓ ఓ ఓ ఓ ఓ.....

ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు

ఒక్క బాటపై కలసి నడిచారు వారు

అన్నంటే తమ్ములకు అనురాగమే...

అన్నకు తమ్ములంటే అనుబంధమే...

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..


చరణం 2: 


చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..

చల్లని తల్లీ ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచెనూ..

పిల్లలకూ..పెద్దలకూ..తల్లివంటిదీ..

ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ..


చరణం 3:


అన్న మనసులో వున్నది ఎన్నో కోరికలూ

తమ్ములకు జరగాలి పెళ్ళీ పేరంటాలు

పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలీ

కలకాలం ఈలాగే కలసివుండాలీ

బాబూ..వినరా..అన్నా తమ్ములా కథ ఒకటీ

కలతలు లేనీ..నలుగురు కలిసీ..

సాగించారు పండంటి కాపురం..

ఆఆ...ఆఆ...ఓఓఓ...ఓఓఓ..


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు | Ghallu Ghalluna Kalla Gajjalu | Song Lyrics | Janani Janmabhoomi (1984)

ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలందెలు మ్రోయ చిత్రం : జనని జన్మభూమి  (1984) సంగీతం : కె వి మహదేవన్  గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, ఎస్ జానకి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు