RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, జనవరి 2024, శుక్రవారం

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు | Enadu kattukunna Bommarillu | Song Lyrics | Pandanti Kapuram (1972)

 ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు



చిత్రం:  పండంటి కాపురం (1972)

సంగీతం:  కోదండపాణి

గీతరచయిత:  సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం:  బాలు, సుశీల


పల్లవి:


    ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు

    ఊ.. ఊ.. ఊ.. ఓ.. ఓహోహో.. ఆహహా..


    ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు


చరణం 1:


    ఆశలే తీవెలుగా     ఉహూ..

    ఊసులే పూవులుగా     ఉహూ..

    వలపులే తావులుగా.. అలరారు ఆ పొదరిల్లు


    ఆ..ఆ..ఆ..


    ఆశలే తీవెలుగా     ఉహూ..

    ఊసులే పూవులుగా     ఉహూ..

    వలపులే తావులుగా.. అలరారు ఆ పొదరిల్లు


    పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా

    పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా

    కురిపించును తేనెజల్లు.. పరువాల ఆ పొదరిల్లు


    ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు


చరణం 2:


    కళ్ళలో కళ్ళుంచీ     ఉహూ..

    కాలమే కరిగించే     ఉహూ..

    అనురాగం పండించే.. ఆ బ్రతుకే హరివిల్లు


    ఆ..ఆ..ఆ..


    కళ్ళలో కళ్ళుంచీ     ఉహూ..

    కాలమే కరిగించే     ఉహూ..

    అనురాగం పండించే.. ఆ బ్రతుకే హరివిల్లు


    నా దేవివి నీవైతే.. నీ స్వామిని నేనైతే

    నా దేవివి నీవైతే.. నీ స్వామిని నేనైతే

    పచ్చని మన కాపురమే.. పరిమళాలు వెదజల్లు


    ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ..

    కావాలి ముందు ముందు పొదరిల్లు.. 

పొదరిల్లు


    ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ..

    ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ..


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు