నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
చిత్రం : రాధాకృష్ణ (1978)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆహా లలలలలలా ఆహా లలలలలలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
చరణం 1 :
మల్లెలు పూసే చల్లని వేళ మనసులు కలపాలీ
మల్లెలు పూసే చల్లని వేళ మనసులు కలపాలీ
అల్లరి చేసే పిల్లగాలిలో ఆశలు పెంచాలి
ఒంటరితనము ఎంత కాలము జంట కావాలి..
నీకొక జంట కావాలి
ఇటు చూడవా మాట్లాడవా.. ఈ మౌనం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా.. మాట్లాడవా.. ఈ బింకం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
చరణం 2 :
చల్లని వేళ నీ ఒళ్లంతా వెచ్చగా ఉంటుందా?..
హ్మ్.. ఉంటుంది
నడిరేయైనా నిదురే రాక కలతగా ఉంటుందా? ..
అవును.. అలాగే ఉంటుంది
ఉండి ఉండి గుండెలోనా దడదడమంటుందా? ..
అరే.. నీకెలా తెలుసు
ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద జబ్బే..ఊ
ఈ పిచ్చికి ఈ ప్రేమకు ఇక పెళ్ళే ఔషధమూ..
హ హ హ
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి