RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, నవంబర్ 2026, బుధవారం

ఊరంతా వెలుగుల పండగొచ్చెరో | దీపావళి పాట | Deepavali Song Lyrics | RKSS Creations.

ఊరంతా వెలుగుల పండగొచ్చెరో 


దీపావళి పాట 

రచన : రామకృష్ణ దువ్వు

Album: RKSS Creations...


పల్లవి:


ఊరంతా వెలుగుల 

పండగొచ్చెరో... 

ప్రతి ఇంట సంబరాలు 

వెల్లువచ్చెరో!

దివ్వెల కాంతుల 

సంకేతాలందుకొని 

దివిలోని దేవతలు 

దీవెనలు కురిపించగా

అందరి మనసుల 

మెరిసే స్నేహావళి!

చిన్నారుల నవ్వుల 

ముత్యాలావళి…


దీపావళి... ఇది దీపావళి...

దీపావళి... ఇది దీపావళి...


చరణం 1:


తొలి పొద్దున ముంగిట్లో 

స్వాగతించె రంగవల్లులు

పిండివంటల సువాసనలతో 

ఇల్లంతా ఘుమఘుమలు 

రంగురంగుల బట్టలతో ముస్తాబై 

అందుకొనగ పెద్దల దీవెనలు 

మామిడి తోరణాల 

ముంగిట నిలచే...

చిరునవ్వుల తారకలు 

పలకరించి పాడే..


దీపావళి... ఇది దీపావళి...

దీపావళి... ఇది దీపావళి...


చరణం 2:


చీకటిని తరిమి కొడుతూ 

ఊరంతా దీపాల వెలుగులు...

మతాబుల చినుకుల 

మైమరపులతో 

నింగికెగిరే తారాజువ్వలు …

కాకరపూవత్తుల కాంతులతో 

పాపాయి కళ్లల్లో కేరింతలు 

అష్టలక్ష్మీ దేవిని 

శ్రద్దగా పూజించ 

ప్రతి ఇంట వర్షించే 

భాగ్యామృతం…


దీపావళి... ఇది దీపావళి...

దీపావళి... ఇది దీపావళి...


- రామకృష్ణ దువ్వు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓణి వేసిన దీపావళి వచ్చెను | Vonivesina Deepavali | Song Lyrics | Pandem Kodi (2005)

ఓణి వేసిన దీపావళి వచ్చెను  చిత్రం: పందెంకోడి (2005) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: వెన్నెలకంటి గానం: రఘు కుంచె, నాగ సాహితి, స్వర్ణ పల్లవ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు