RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
mani sharma songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mani sharma songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2026, శుక్రవారం

అలనాటి రామచంద్రుడు | Alanati Ramachandrudu | Song Lyrics | Murari (2001)

అలనాటి రామచంద్రుడు   


చిత్రం : మురారి (2001)

రచన :  సిరివెన్నెల 

సంగీతం : మణిశర్మ 

గానం : జిక్కి, సునీత, సంధ్య 


పల్లవి :


అలనాటి రామ చంద్రుడి

కన్నింటా సాటి

ఆ పలనాటీ బాల చంద్రుడి 

కన్నా అన్నింట మేటి

అలనాటి రామ చంద్రుడి

కన్నింటా సాటి

ఆ పలనాటీ బాల చంద్రుడి 

కన్నా అన్నింట మేటి

అనిపించే అరుదైన 

అబ్బాయికి మనువండీ

ఆ ఆ ఆ


తెలుగింటి పాలసంద్రము 

కనిపెంచిన కూన

శ్రీహరి ఇంటి దీపమల్లే 

కనిపించిన జాణ

తెలుగింటి పాలసంద్రము 

కనిపెంచిన కూన

శ్రీహరి ఇంటి దీపమల్లే 

కనిపించిన జాణ

అటువంటి అపరంజి 

అమ్మాయిని కనరండీ

ఆ ఆ ఆ


అను పల్లవి :


చందమామా చందమామా 

కిందికి చూడమ్మా

ఈ నేలమీది నెలరాజుని 

చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా 

వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా లేవని 

వెల వెల బోవమ్మా


చరణం 1 :


పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ 

పురుషుడి మునివేళ్ళు

పచ్చని మెడపై వెచ్చగ 

రాసెను చిలిపి రహస్యాలు

నేలకు జారిన తారకలై 

ముత్యాల తలంబ్రాలు

ఇద్దరి తలపును ముద్దగ 

తడిపెను తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి 

విందులు చేసే సమయాన

ఆ ఆ ఆ ఆ ఆ


అందాల జంట అందరి కంటికి 

విందులు చేసే సమయాన

కలలకు దొరకని కళ కళ 

జంటను పదిమంది చూడంది

తళ తళ మెరిసిన ఆనందపు 

తడి చూపుల అక్షింతలేయండి


చందమామా చందమామా 

కిందికి చూడమ్మా

ఈ నేలమీది నెలరాజుని 

చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా 

వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా 

లేవని వెల వెల బోవమ్మా


చరణం 2 :


సీతారాముల కళ్యాణంలా 

కనిపిస్తూ ఉన్నా

విరగలేదు ఆ శివుని విల్లు 

ఈ పెళ్ళి మండపానా

గౌరి శంకరులేకమైన 

సుముహూర్తమల్లే ఉన్నా

మరగలేదు మన్మథుని 

ఒళ్ళు ఈ చల్లని సమయానా

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా 

ఇంత ఘనంగా జరిగేనా

ఆ ఆ ఆ ఆ ఆ


దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా 

ఇంత ఘనంగా జరిగేనా

అనుకొని కనివిని ఎరుగని 

పెళ్ళికి జనమంతా రారండి

తదుపరి కబురుల వివరములడగక 

బందువులంతా కదలండి


చందమామా చందమామా 

కిందికి చూడమ్మా

ఈ నేలమీది నెలరాజుని 

చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా 

వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా 

లేవని వెల వెల బోవమ్మా


- పాటల ధనుస్సు 


24, జూన్ 2025, మంగళవారం

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా



చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ 

నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్, నిహాల్ 


పల్లవి :


థంబ్స్ అప్ థండర్ కైనా

దడ దడ పుట్టించేలా

పిడుగై దుకే

నడకే చూసా మహారాజా


ఎవరెస్ట్ మౌంటెన్ అయినా

గడ గడ లాడించేలా

తడి సోకుల్లో

తళుకే చూసా నవ రోజా


థంబ్స్ అప్ థండర్ కైనా

దడ దడ పుట్టించేలా

పిడుగై దుకే

నడకే చూసా మహారాజా


చరణం 1 :


అడిగిందడిగి నట్టు ఇస్తా

వొడిలో తిరిగి చెయనిస్త

జతగా ఉండిపో హమేషా 

ఆఆఆఆ ఆఆఆఆ


ఉసిగొట్టకల కలహంస

పసి వయసుకెందుకే హింస

మొదలెట్టానంటే ఆగదు నా హింస


కన్యదన మిచ్చా కళ్యాణం లో

కానుకిస్త ఏకాంతం లో

కమ్ముకుంటే ఆమ్మో అంతన ఆఆ ఆఆఆ


వయ్యారాలు మెచ్చే వ్యామోహం లో

మత్తు పెంచే మా లోకం లో

పైకి తేలే మార్గం తెలిసేనా ఆఆ


తెల్లారే దాకా తెలవా

అల్లాడే ఆత్రం చూడవా

కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా


నీ కనికట్టేదో మానవ

నన్నిట కట్టే మాయావా

నీ మెలికల్లో ముడి వదిలేసాక

దేఖో నా వరసా


ఉసి గొట్టకల కల హంస

పసి వయసు కెందుకే హింస

మొదలెట్టా నంటే ఆగదు నా హింస


థంబ్స్ అప్ థండర్ కైనా

దడ దడ పుట్టించేలా

పిడుగై దుకే

నడకే చూసా మహారాజా


చరణం 2 :


కొంచం సాయమిస్తే సావాసంగా

ప్రాయమిస్తా సంతోషంగా

సోయగం నీ సొంతం చేస్తాగా ఆఆ


ఇట్టా సైగ చేస్తూ సమ్మోహన్గా

స్వాగతిస్తే సింగారంగా

స్వీకరిస్తా మహాదా నందంగా ఆఆ


ముస్తాబై వచ్చా ముద్దు గ

మైమరిపిస్త మరి కొద్దిగా

నువ్వు సరదా పడితే

సిద్ధం గానే నున్నగా


గమనిస్తున్న నే శ్రద్ధగా

కవ్విస్తుంటే సరి కొత్తగా

పెదవేలే పదవె ఇస్తానంటే

ఇదిగో వచ్చేసా


ఉసి గొట్టకల కల హంస

పసి వయసు కెందుకే హింస

మొదలెట్టా నంటే ఆగదు నా హింస


థంబ్స్ అప్ థండర్ కైనా

దడ దడ పుట్టించేలా

పిడుగై దుకే

నడకే చూసా మహారాజా


అడిగిందడిగి నట్టు ఇస్తా

వొడిలో తిరిగి చెయ్యనిష్ఠా

జతగా ఉండిపో హమేషాఆఆఆఆ


ఉసిగొట్టకల కలహంస

పసి వయసుకెందుకే హింస

మొదలెట్టానంటే ఆగదు నా హింస


- పాటల ధనుస్సు 


19, సెప్టెంబర్ 2024, గురువారం

మహా ముద్దొచ్చేస్తున్నావోయ్ | Maha Muddochestunnavoy | Song Lyrics | Jai Chiranjeeva (2005)

మహా ముద్దొచ్చేస్తున్నావోయ్



చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ 

నేపధ్య గానం : శ్రేయ ఘోషాల్, కార్తీక్ 


పల్లవి :


మహా ముద్దొచ్చేస్తున్నావోయ్

మతి పోగెట్టేస్తున్నావోయ్

నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక


మహా ముద్దొచ్చేస్తున్నావోయ్

మతి పోగెట్టేస్తున్నావోయ్

నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక


యమా హోరెత్తిస్తున్నవే

తెగ మారం చేస్తున్నావే

బరువంతా నాతో మోయిస్తావా బాలిక


కోర మీసంతో కోపం కోరుకుంటున్న

కూడదంటానా కోరికేసిన


పాపమనుకొన అయ్యో పాపమనుకొన

బైట పడతాన బతిమాలినా


మహా ముద్దొచ్చేస్తున్నావోయ్

మతి పోగెట్టేస్తున్నావోయ్

నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక


యమా హోరెక్కిస్తున్నవే

తెగ మారం చేస్తున్నావే

బరువంతా నాతో మోయిస్తావా బాలిక


చరణం 1 :


ఈడు గుమ్మంల్లో నిలబడి ఈలా వేస్తున్న

విన్నపాలేవీ వినిపించవ


ఆడ గుండెల్లో అలజడి ఆలకిస్తున్న

ఏమి కావాలో వివరించవా


నవనవ లాడే నునుపుల్లో లేత పూత పిలిచాక

వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనకా


మిసమిస లాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా

సలసల లాడే సరసంలో నను దించక


మహా ముద్దొచ్చేస్తున్నావోయ్

మతి పోగెట్టేస్తున్నావోయ్

నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక


యమా హోరెత్తిస్తున్నవే

తెగ మారం చేస్తున్నావే

బరువంతా నాతో మోయిస్తావా బాలిక


చరణం 2 :


చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా

పైట ఎగిరేసే పరుగాపవ


సీత కన్నేసి చెలియాకి అందనంటావా

చేత చెయ్యేసి లాలించవా


అడుగున ఊగే జడగంట తిప్పుకోకే నీ వెనుక

ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పిన వినక


తహ తహ లాడే తపనంతా తాళలేను ఒంటరిగా

తడబడి పొద తనువంతా పరువోపక


మహా వీర మానస చోర

బహుమానంగా దరి చెర

ఇక ఏదేమయిన నీదే భారం దేవర


యమా హోరెత్తే సెలయేర

గమనిస్తున్న కళ్లారా

శృతి మించిందే నీ యవ్వారం కిన్నెరా


కోర మీసంతో కోపం కోరుకుంటున్న

కూడదంటానా కోరికేసిన


పాపం అనుకొన్న అయ్యో పాపమనుకొన

బైట పడతాన బతిమాలినా


మహా ముద్దొచ్చేస్తున్నావోయ్

మతి పోగెట్టేస్తున్నావోయ్

నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక


యమా హోరెత్తిస్తున్నవే

తెగ మారం చేస్తున్నావే

బరువంతా నాతో మోయిస్తావా బాలిక


- పాటల ధనుస్సు 


18, సెప్టెంబర్ 2024, బుధవారం

కో కో కోడి బాగుంది | Koko kodi Bagundi | Song Lyrics | Jai Chiranjeeva (2005)

కో కో కోడి బాగుంది



చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : భువన చంద్ర 

నేపధ్య గానం : ఉదిత్ నారాయణ్, చిత్ర 


పల్లవి :


కో కో కోడి బాగుంది

కు కు కూత బాగుంది

కో కో కోడి బాగుంది

కు కు కూత బాగుంది

అందం ఆమె ల ఉంది

అదిరే ఆశ రేపింది

కసిగా కమ్ముకోకుంటే

వయసే ఊరుకొనంది

మూడు జాములున్న రేయి

ముందరున్నది


కుర్ర పుంజు బాగుంది

కూసే కూత బాగుంది

దొంగ చాటుగా పెట్టె

ము ము ముద్దు బాగుంది

ముద్దు తోడుగా వచ్చే

కౌగిలి ఎంత బాగుంది


బుగ్గ మీద గాని పైట

బిగిసుకున్నది


చరణం 1 :


కొత్త కొరికేదో

గుండెలోన గుప్పు మన్నదోయి


మత్తు కమ్మి నిన్నే

దుప్పటల్లే కప్పమన్నదోయి


మధన సంధ్య వేళలో

మాటలెందుకమ్మాడు

ముద్దు పూజ మానితే

మొరలు వినడు కాముడు


మొదలు పెడితే ఆగలేని

రాచగుమ్మడు


కుర్ర పుంజు బాగుంది

కూసే కొత్త బాగుంది

దొంగ చాటుగా పెట్టె

ము ము ముద్దు బాగుంది

ముద్దు తోడుగా వచ్చే

కౌగిలి ఎంత బాగుంది


బుగ్గ మీద గాని పైట

బిగిసుకున్నది


చరణం 2 :


శీతాకాలమైన నిన్ను తాకి

వేసవైపొద


నిన్ను చూడగానే వెన్నుపూసా

ఊయలూగేయధా


పరిమళాల తోటలో

పూల పాన్పు వేయన

పండు లాంటి గుండెని

దిండు లాగ మార్చనా


ఒక్క సారి చెయ్యి చాస్తే

గులమవ్వన


కో కో కోడి బాగుంది

కు కు కూత బాగుంది

అందం ఆమె ల ఉంది

అదిరే ఆశ రేపింది

కసిగా కమ్ముకోకుంటే

వయసే ఊరుకొనంది

మూడు జాములున్న రేయి

ముందరున్నది


- పాటల ధనుస్సు


17, సెప్టెంబర్ 2024, మంగళవారం

హేయ్ జానా | Hey Jana | Song Lyrics | Jai Chiranjeeva (2005)

హేయ్ జానా



చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : చంద్రబోస్

నేపధ్య గానం : సచిన్ టైలర్ 


పల్లవి :


హేయ్ జానా

హే హే జానా

హేయ్ జానా

హే హే జానా అందమే ఎంతున్నా

హేయ్ జానా

హే హే జానా దాచుకో కొంతైన


చీర కడితే సింగారం

వోణి చుడితే వయ్యారం

పొట్టి బట్టలు కట్టావో

బట్ట భయాలే బండారం


గుమ్ము గుమ్మెత్తే ఆకారం

గోదాట్లో కలపకు ఆచారం


గుమ్ము గుమ్మెత్తే ఆకారం

గోదాట్లో కలపకు ఆచారం

చిర్రు చిర్రెతే యవ్వారం

చీకట్లో చేయకు సంచారం


హే జాన

హే హే జానా అందమే ఎంతున్నా

హేయ్ జానా

హే హే జానా దాచుకో కొంతైన



చరణం 1 :


ఆ అమృతం ఆ అద్భుతం

ఆ అందము మేమేగా


ఆ అమృతం ఆ అద్భుతం

ఆ అందము మేమేగా


ఆ అల్లరి ఆ అలజడి

అన్నింటిలో మేమేగా


ఆ అంటే అమ్మాయి

అపురూపం మీరొయి

అపహాస్యంగా మారొద్దుగా


జబ్బపైన టాటూలు

జామురాతిరి పార్టీలు

కట్టుబాట్లకు వీడ్కోలు

కన్నవాళ్లకు కన్నీళ్లు


గుమ్ము గుమ్మెత్తే ఆకారం

గోదాట్లో కలపకు ఆచారం


గుమ్ము గుమ్మెత్తే ఆకారం

గోదాట్లో కలపకు ఆచారం

చిర్రు చిర్రెతే యవ్వారం

చీకట్లో చేయకు సంచారం


మా అసలు మా ఊహలు

హైరేంజిలో ఉంటాయి


చరణం 2 :


మా ఆశలు మా ఊహలు

హైరేంజిలో ఉంటాయి


ఎంతెత్తుకి మీరేదిగిన

ఈ నేలనె చూడాలి


వేగంగా పరుగెత్తే కాలంతో కదలందె

థ్రిల్లేముంది టీనేజీకి


నెట్టులోన ఛాటింగు

పార్కులోన మీటింగు

మార్చుకో ని థింకింగ్

చేసిచూపు సంథింగ్


గుమ్ము గుమ్మెత్తే ఆకారం

గోదాట్లో కలపకు ఆచారం


గుమ్ము గుమ్మెత్తే ఆకారం

గోదాట్లో కలపకు ఆచారం

చిర్రు చిర్రెతే యవ్వారం

చీకట్లో చేయకు సంచారం


హే జాన

హే హే జానా అందమే ఎంతున్నా


- పాటల ధనుస్సు


1, సెప్టెంబర్ 2024, ఆదివారం

జై జై గణేశా జై కొడతా గణేశా | Jai Jai Ganesha Jekodatha Ganesha | Song Lyrics | Jai Chiranjeeva (2005)

జై జై గణేశా జై కొడతా గణేశా



చిత్రం : జై చిరంజీవ (2005)

సంగీతం : మణిశర్మ

గీతరచయిత : చంద్రబోస్

నేపధ్య గానం : బాలు 


పల్లవి : 

గణేశ్ మహరాజ్ కి.. జై...

గణేశ్ మహరాజ్ కి.. జై... 


ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

ఓం... జై గణపతి...  జై జై జై.. గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా


లోకం నలుమూలలా లేదయ్యా కులాసా

దేశం పలువైపులా ఏదో రభస

మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా

పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా


చిట్టి ఎలుకను ఎక్కి... 

గట్టి కుడుములు మెక్కి

చిక్కు విడిపించగ 

నడిపించగ చెయ్యి తమాషా

గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి


గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా

హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా


లంబోదరా శివా సుతాయా.. 

లంబోదర నీదే దయ

లంబోదరా శివా సుతాయా.. 

లంబోదర నీదే దయ..  

లంబోదర నీదే దయ  


చరణం   1 : 


నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి.. 

వాహనమై ఉండలేదా

ఎలకేమో తమరికి నెమలేమో తంబికి... 

రథమల్లే మారలేదా


పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా... 

కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా

ఎందుకు మాకీ హింసామార్గం... 

ఎదిగేటందుకు అది ఆటంకం

నేర్పరా మాకు సోదరభావం... 

మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా


గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి

గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  

గణేశా

హాయ్ హాయ్ గణేశా... 

అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  

గణేశా


చరణం   2 : 


చందాలను అడిగిన దాదాలను 

దండిగా తొండంతో తొక్కవయ్యా

లంచాలను మరిగిన నాయకులను 

నేరుగా దంతంతో దంచవయ్యా


ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ.. 

మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా

మాలో చెడునే ముంచాలయ్యా.. 

లోలో అహమే వంచాలయ్యా

నీలో తెలివే పంచాలయ్యా... 

ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ


గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి

గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి

జై జై గణేశా... జై కొడతా.. గణేశా

జయములివ్వు బొజ్జగణేశా...  గణేశా


హాయ్ హాయ్ గణేశా... అడిగేస్తా గణేశా

అభయమివ్వు బుజ్జిగణేశా...  గణేశా

లోకం నలుమూలలా లేదయ్యా కులాసా

దేశం పలువైపులా ఏదో రభస


మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా

పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎక్కి... 

గట్టి కుడుములు మెక్కి

చిక్కు విడిపించగ నడిపించగ 

చెయ్యి తమాషా

గణేశా.. గమ్ గణపతి... గణేశా...  

గమ్ గణపతి

గణేశా..  గమ్ గమ్ గమ్ గమ్ గణపతి


గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా

గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా

గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా

గణపతి బప్పా మోరియా...

ఆధా లడ్డు ఖా లియా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు