RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
murari songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
murari songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2026, శుక్రవారం

అలనాటి రామచంద్రుడు | Alanati Ramachandrudu | Song Lyrics | Murari (2001)

అలనాటి రామచంద్రుడు   


చిత్రం : మురారి (2001)

రచన :  సిరివెన్నెల 

సంగీతం : మణిశర్మ 

గానం : జిక్కి, సునీత, సంధ్య 


పల్లవి :


అలనాటి రామ చంద్రుడి

కన్నింటా సాటి

ఆ పలనాటీ బాల చంద్రుడి 

కన్నా అన్నింట మేటి

అలనాటి రామ చంద్రుడి

కన్నింటా సాటి

ఆ పలనాటీ బాల చంద్రుడి 

కన్నా అన్నింట మేటి

అనిపించే అరుదైన 

అబ్బాయికి మనువండీ

ఆ ఆ ఆ


తెలుగింటి పాలసంద్రము 

కనిపెంచిన కూన

శ్రీహరి ఇంటి దీపమల్లే 

కనిపించిన జాణ

తెలుగింటి పాలసంద్రము 

కనిపెంచిన కూన

శ్రీహరి ఇంటి దీపమల్లే 

కనిపించిన జాణ

అటువంటి అపరంజి 

అమ్మాయిని కనరండీ

ఆ ఆ ఆ


అను పల్లవి :


చందమామా చందమామా 

కిందికి చూడమ్మా

ఈ నేలమీది నెలరాజుని 

చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా 

వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా లేవని 

వెల వెల బోవమ్మా


చరణం 1 :


పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ 

పురుషుడి మునివేళ్ళు

పచ్చని మెడపై వెచ్చగ 

రాసెను చిలిపి రహస్యాలు

నేలకు జారిన తారకలై 

ముత్యాల తలంబ్రాలు

ఇద్దరి తలపును ముద్దగ 

తడిపెను తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి 

విందులు చేసే సమయాన

ఆ ఆ ఆ ఆ ఆ


అందాల జంట అందరి కంటికి 

విందులు చేసే సమయాన

కలలకు దొరకని కళ కళ 

జంటను పదిమంది చూడంది

తళ తళ మెరిసిన ఆనందపు 

తడి చూపుల అక్షింతలేయండి


చందమామా చందమామా 

కిందికి చూడమ్మా

ఈ నేలమీది నెలరాజుని 

చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా 

వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా 

లేవని వెల వెల బోవమ్మా


చరణం 2 :


సీతారాముల కళ్యాణంలా 

కనిపిస్తూ ఉన్నా

విరగలేదు ఆ శివుని విల్లు 

ఈ పెళ్ళి మండపానా

గౌరి శంకరులేకమైన 

సుముహూర్తమల్లే ఉన్నా

మరగలేదు మన్మథుని 

ఒళ్ళు ఈ చల్లని సమయానా

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా 

ఇంత ఘనంగా జరిగేనా

ఆ ఆ ఆ ఆ ఆ


దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా 

ఇంత ఘనంగా జరిగేనా

అనుకొని కనివిని ఎరుగని 

పెళ్ళికి జనమంతా రారండి

తదుపరి కబురుల వివరములడగక 

బందువులంతా కదలండి


చందమామా చందమామా 

కిందికి చూడమ్మా

ఈ నేలమీది నెలరాజుని 

చూసీ నివ్వెరబోవమ్మా

వెన్నేలమ్మా వెన్నేలమ్మా 

వన్నెలు చాలమ్మా

మా అన్నులమిన్నకు సరిగా 

లేవని వెల వెల బోవమ్మా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు